హిందు కర్మసిద్ధాంతం వాక్యానుసారమైనది కాదు!

కర్మ సిద్ధాంతం బైబిల్ సిద్ధాంతం ఒకటి కాదు అనడానికి నాలుగు కారణాలు. ఏది విత్తుతామో అదే కోస్తాం అనే వాక్యానికి హిందు కర్మకు మధ్య గజిబిజి అయిపోవద్దు. ఈరోజు వాక్యధ్యానం మనకొక స్పష్టమైన వాక్యానుశారమైన నడిపింపునిస్తుంది!


"కర్మ అంటే నన్ను గాయపరిచిన వారికి అదే తిరిగి వస్తుంది అని నమ్మి, నిశ్చింతగా రాత్రి నిద్రపోవడం"


ఈ పై కొటేషన్ అర్ధం 'మాటలు అదుపులో పెట్టుకోవాలి' అని నేను అనుకున్నాను. కాని హిందు కర్మ సిద్ధాంతం ఎంత అస్థిరమైనదో ఈ మాటలే నిరూపిస్తున్నాయి అని అనిపించింది.


కర్మ సిద్ధాంతం అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి వచ్చే జన్మలో తన పరిస్థితులు ఉంటాయాని అర్ధం!


కర్మ సిద్ధాంతం కొంచెం బైబిల్ సిద్ధాంతంలాగ  అనిపిస్తుంది :


మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. (గలతీ 6:7,8)


*కాని రెండు ఒకటి కాదు.


బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది :


1. మనం ఒక్కసారే జీవిస్తాం, ఒక్కసారే తీర్పు పొందుతాం. మరో జన్మ లేదు (హెబ్రీ 9:27,28)


2. మనం విత్తిందే కోస్తాం, కాని అది సాధారణంగా పరలోకానికి చేరే లోపు కాదు. (గలతీ 6:9, యోహాను 16:33)


3. మనుషులకు వచ్చే సమస్యలు, సాధారణంగా వాటిని పొందటానికి వారు అర్హులైనందువల్ల వచ్చినవి కాదు! (1 కొరింధీ 4:5)


4. దేవునికి మహిమ కలుగును గాక! కర్మకు, క్రైస్తవ్యానికి ఉన్న అతి పెద్ద తేడా ఏమిటంటే : కృప (రోమా 6:23)


మనం యేసు క్రీస్తును విశ్వాసిస్తే, అసలు మనం ఏది పొందడానికి నిజంగా అర్హులమో అది మాత్రం మనం పొందము, దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా!


Hindu Karma Isn't Biblical


కర్మ సిద్ధాంతం బైబిల్ సిద్ధాంతం ఒకటి కాదు అనడానికి నాలుగు కారణాలు. ఏది విత్తుతామో అదే కోస్తాం అనే వాక్యానికి హిందు కర్మకు మధ్య గజిబిజి అయిపోవద్దు. ఈరోజు వాక్యధ్యానం మనకొక స్పష్టమైన వాక్యానుశారమైన నడిపింపునిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.