ఆధునిక మోసాలు!


అనేకమంది ఆధునిక క్రైస్తవులు, యిర్మియా కాలంలోలానే అబద్ద ప్రవక్తల 'మంచి భావాలతో' కూడిన బోధలు వినడానికే ఇష్టపడతారు. క్రీస్తు బోధకు, ఇటువంటి బోధకు మధ్య వ్యత్యాసాన్ని ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!


పాపులర్ బోధకుల్లో చాలా మంది పాపం, నరకం గురించి చెప్పడం కంటే, ప్రజలు వారిని వారు మంచివారిగా భావించుకోవాలనే ఎక్కువ చెప్తారు. కాని యేసు వారిలా కాదు. తరుచూ ఆయన బోధ పశ్చాతాపం, తగ్గింపు, త్యాగం, పాపం, నరకం గురించే ఎక్కువ ఉండేది. (1)


చాలా మంది పాపులర్ బోధకులు సంపన్నమైన జీవితాన్ని జీవిస్తూ, తన పిల్లలు ధనవంతులుగా, సౌకర్యవంతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని నొక్కి చెప్తుంటారు. కాని యేసు ప్రభువు ఒక సొంత స్థలం కూడా లేని జీవితాన్ని జీవించాడు, ధనమే తరుచూ మనుషులను పాడుచేస్తుందని బోధించాడు. (2)


మంచి అనుభూతినిచ్చే సందేశాలు ఎక్కువ ప్రజాదరణ పొందుతాయి :


దేవుని ప్రజలకు పశ్చాతాపం పొంది, నాశనాన్ని తప్పించుకోమని యిర్మియా హెచ్చరించాడు.


కాని యిర్మియా కాలంలో ఉన్న పాపులర్ "ప్రవక్తలు", చింతించకండి, మీకు ఎటువంటి అపాయం రాదు, మీకు సమాధానం అని ప్రభువు చెబుతున్నాడని ప్రకటించారు.


ఇలా అబద్దాలు చెప్పే ప్రవక్తలు అప్పటి ప్రజలను తమను గురించి తాము మంచిగా భావించుకునేలాగ తయారుచేసారు.


కాని యిర్మియా మాటలే నిజమని నిరూపించబడ్డాయి.


పాపం, నరకం గురించి అర్ధం చేసుకోలేకపోతే, దేవుని అద్భుతమైన కృపాకనికరాలు ఎప్పటికీ అర్ధం చేసుకోలేము. ప్రస్తుత జీవితంలో ధనం కోసం ప్రాకులాడితే, పరలోకంలో ధనాన్ని పోగొట్టుకుంటాం.


ప్రేరణ కలిగించే మంచి భావాలతో కూడిన బోధలు వినడం మాని, యదార్థమైన బైబిల్ బోధకుల బోధలే వినడానికి జాగ్రత్తపడదాం.


నోట్ :


(1) మత్తయి 10:38


(2) ధనాన్ని గురించి క్రీస్తు మాటల్లో :


కొంతమంది క్రైస్తవులకు దేవుడు ధనాన్ని తన ప్రణాళికలు వారు నెరవేర్చడం కోసం ఇస్తాడు అంతేకాని ధనాన్ని దేవుడు వాగ్దానం చేయలేదు, ధనం కలిగి ఉండటం విశ్వాసానికి గురుతు కాదు. మత్తయి 6:19-21 మనం ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోవాలి అని ఉంది కాని భూమిపై కాదు.


ధనం మోసకరమైనదని, మన ఆత్మీయ పరిపక్వతకు విశ్వాసానికి అది ఎప్పుడూ అడ్డుపడుతుంటుందనే భావన మత్తయి 13:22 లో చూస్తాం.


ఇతరుల విశ్వాసాన్ని వారికున్న ధనాన్ని బట్టి తీర్పు తీర్చడం సరైనది కాదని లూకా 12:15 చెబుతుంది.


ధనం గురించి ఇతర వాక్యభాగాలు :

• లోకభోగాలు కోసం చేసే ప్రార్ధనలు జవాబును పొందవని యాకోబు 4:3 లో వ్రాయబడింది.


• లోకానుశారమైన వస్తువుల గురించిన అత్యాశ, విగ్రహారాధనగా కొలస్సీ 3:5 లో వ్రాయబడింది.


• సంతృప్తి విశ్వాసానికి గుర్తని 1 తిమోతి 6:6-10 చెబుతుంది. మనకు తినడానికి ఆహరం, వేసుకోవడానికి బట్టలు ఉంటే వాటితో సంతృప్తిగా ఉండాలి. ధనాశ మనలను దేవుని నుండి దూరం చేస్తుంది.


• ధనానికి విశ్వాసానికి ఎటువంటి సంబంధం లేదని యాకోబు 2:5 చెబుతుంది. సాధారణంగా బీదవారే ఎక్కువ విశ్వాసం చూపుతారు!


Modern Deceptions


అనేకమంది ఆధునిక క్రైస్తవులు, యిర్మియా కాలంలోలానే అబద్ద ప్రవక్తల 'మంచి భావాలతో' కూడిన బోధలు వినడానికే ఇష్టపడతారు. క్రీస్తు బోధకు, ఇటువంటి బోధకు మధ్య వ్యత్యాసాన్ని ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.