దేవుని మార్గాలకు మనుషుల మార్గాలకు మధ్య వ్యత్యాసాన్ని చూపే ఉదాహరణలే ఈ గొప్ప ఆత్మసంబంధమైన ఐశ్వర్యంతో నిండిన ధన్యతలు.
మొదటిగా :
ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. (మత్తయి 5:3)
దీనత్వం (లేక బీదరికం) అంటే మనం ఒక ప్రతికూలమైనదిగా భావిస్తాం.. అది ఆర్ధిక పరిస్థితులైనా, చదువులు, ఎలా కనపడుతున్నాం, ఆరోగ్యం, ఇలా ఇంకా ఎన్నో పరిస్థితులు.
కాని ఆఖరికి దేవుడు అన్నింటినీ తారుమారు చేస్తాడు. ఆయన మార్గాలు ఈ లోకపు మార్గాల వంటివి కావు (యెషయా 55:8-9).
ఆలయంలో ఉన్న సుంకరి ఆత్మయందు దీనత్వాన్ని కలిగి ఉన్నాడు (లూకా 18:9-14). తన పాపస్థితిని అలాగే దేవుని కృప యొక్క అవసరతను పూర్తిగా అర్ధం చేసుకున్నవాడు.
అలాంటి వారు తమను తాము చేతులు చాపి దేవుని కనికరాన్ని వేడుకునే బిచ్చగాళ్ళు లాగా చూసుకుంటారు. వారు త్వరగా, నిజాయితీగా పశ్తాతాపపడతారు అంతే కాకుండా దేవుని నుండి వారు పొందిన ఆ కనికరాన్నే ఇతర పాపులకు చూపుతారు.
వారు ఈ లోకంలో ధనవంతులు లేక బీదవారు కావొచ్చు, ప్రపంచానికి తెలిసినవారు లేక తెలియని వారు కావొచ్చు, చదువుకున్న వారు లేక చదువుకోని వారు కావొచ్చు.. కాని క్రీస్తు సిలువ దగ్గర తమను తాము పెట్టుకోగలిగిన దేవునికి లోబడే వినయం కలిగిన వారు.
వారు దేవుని శిక్షను, ఆజ్ఞలను, విధానాలను ప్రశ్నించరు. వారికి తెలుసు దేవుడు మాత్రమే దేవుడు కాని, వారు కాదని.
ప్రియ చదువరి, నీవు ఆత్మయందు దీనత్వాన్ని కలిగి ఉన్నావా? నిన్ను నీవే పరీక్షించుకో!
#1: Blessed Are the Poor in Spirit
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.