#3: సాత్వికులు ధన్యులు!

బైబిల్ సాత్వికత అర్థం నువ్వు అనుకున్నది కాకపోవచ్చు. అది బలహీనమైనది లేక సిగ్గుతో కూడినది కాదు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. (మత్తయి 5:5)


"సాత్వికం" అర్ధం కేవలం సౌమ్యం మాత్రమే కాదు. గ్రీకులో బైబిల్ అర్థం ఏమిటంటే అది సౌమ్యత, తగ్గింపు, బలం యొక్క కలయిక. ఇది దైవికమైన నాయకుల్లో అలాగే నమ్మకంగా వెంబడించేవారిలో కూడా ఉంటుంది.


"సాత్వికులు" అతిగా సున్నితంగా, డిమాండింగా, అమర్యాదగా, స్వయం కేంద్రీకృతంగా, గర్వాంగా ఉండరు (ఫిలిప్పీ 2:3).


ఆమె ఎంతో జాగ్రత్తగా వింటుంది, కృపాసహితంగా మాట్లాడుతుంది, త్వరగా కోపపడదు (యాకోబు 1:19).


ఆమె సువార్త అనే ఉప్పును పంచడం నుండి తప్పించుకోదు, కాని దానిని కృపాసహితంగా పంచుతుంది (కొలస్సీ 4:6).


సాత్వికులు ఎలా భూలోకమును స్వతంత్రించుకుంటారు? దీనర్ధం వారు ధనవంతులుగా అయిపోయి, సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తారనా?


సాత్వికులు బహుశా ఇహలోకంలో విజయం పొందొచ్చేమో, కాని ఈ ధన్యత మాట్లాడే ఆశీర్వాదం దీని గురించి కాదు. సాత్వికులైనా ఇహలోకంలో సమస్యలు పొందుతారు, అయినప్పటికీ ఆ సమస్యల మధ్యలో వారు దేవుని పై కోపంతో స్పందించడం లేక సులభమైన మార్గం కోసం దేవుని వద్ద ఒక హక్కుగా అడగటం బదులు, తృప్తిని శాంతిని కనుగొంటారు!


సాత్వికులకు తెలుసు వారి నిజమైన వారసత్వం పరలోక "వాగ్దాన భూమే" అని, అందుకే వారు వారి సొంత గృహానికి చేరి వారి ప్రభువుతో కలిసి నివసించడానికి ఎంతో ఆతృత కలిగి ఉంటారు (హెబ్రీ 11:16).


సాత్వికులు ధన్యులు!


#3: Blessed are the Meek


బైబిల్ సాత్వికత అర్థం నువ్వు అనుకున్నది కాకపోవచ్చు. అది బలహీనమైనది లేక సిగ్గుతో కూడినది కాదు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.