#4: నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు

నీతికొరకు ఆకలిదప్పులు గురించిన ధన్యత యొక్క అర్థం నీకు పూర్తిగా అర్థమైందా? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు. (మత్తయి 5:6)


నీవు బాగా దాహంగా, ఆకలితో ఉన్నప్పటి సమయాలు గుర్తుచేసుకోని, ఆ రెంటిని కలిపి, ఈ ధన్యతను ఒక ఉపమానంగా ఆలోచించు.


నీతికొరకు ఆకలిదప్పులు గలవారు, దేవుని వాక్య ప్రకారం జీవించాలనే తీవ్రమైన కోరిక కలిగి ఉంటారు.


వారు వారిలో ఉన్న చిన్న చిన్న పాపాలను సమర్ధించుకోవడం లేదా వాటితో సరిపెట్టుకోవడం చేయరు. వాటికై యదార్ధంగా, నిజాయితీగా, పరిపూర్ణంగా, ఎటువంటి సమర్ధించుకోవడం లేకుండా పశ్చాతాపపడతారు.


సంబంధాల్లో ఇతరులపై నిందలు వేయడం కంటే, వారి తప్పు తక్కువే అయినా, తమను తామే నిందించుకుంటారు.


క్రైస్తవ్యం యొక్క అనారోగ్యకరమైన ఆహరం తినడానికి, సంస్కృతి యొక్క కృత్రిమమైన రుచులను ఆస్వాదించడానికి వారు నిరాకరిస్తారు.


వారి జీవితానికి ఏది సరైనదో తెలుసుకోవాలనే తీవ్రమైన కోరికతో, అనుదిన ఆహారం కోసం ఆధారపడేంతగా వారు దేవుని వాక్యంపై ఆధారపడతారు (మత్తయి 4:4). వారి ఆత్మలను ఉజ్జీవపరిచే జీవజలాన్ని ప్రభువే ఇవ్వగలరు అని గ్రహించి, ఆయనతో సమయం గడపడానికి ఎంతో దాహంతో ఉంటారు (యోహాను 4:14).


నీకు నీతి కొరకు ఆకలిదప్పులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే, నీవు ఆశించిన దానికంటే ఎక్కువగానే తృప్తిని పొందుతావు. నువ్వు తప్పకుండ నింపబడతావు, పునరుద్ధరించబడతావు, సేదతీర్చబడతావు, బలపడతావు!


#4: Blessed are Those Who Hunger and Thirst for Righteousness


నీతికొరకు ఆకలిదప్పులు గురించిన ధన్యత యొక్క అర్థం నీకు పూర్తిగా అర్థమైందా? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.