#5: కనికరముగలవారు ధన్యులు

కనికరముగలవారు ధన్యులు - అనే అయిదవ ధన్యత గురించి ఈరోజు వాక్యధ్యానం, స్ఫూర్తినిచ్చే కనికరంతో నిండిన సత్యాలను వివరిస్తుంది. నేర్చుకుందామా!


కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. (మత్తయి 5:7)


కనికరము లేని లోకాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అందులో క్షమాపణ లేదు, సహాయం లేదు, రక్షణ లేదు.


కనికరము మన ప్రపంచంలో ఒక భాగంగా ఉండటానికి ఒక ఒక్క కారణం ఏమిటంటే -  మనం "కరుణాసంపన్నుడైన దేవునిచే" సృష్టించబడ్డాము కనుక (ఎఫెసీ 2:1-5).


ఆయన వాక్యమే కనికరంతో నిండిన ఈ క్రింది సత్యాలను మనకు అందిస్తుంది :


1. కనికరం మనం సంపాదించలేనిది (తీతుకు 3:5).


2. కనికరాన్ని దేవుని నుండే మనం నేర్చుకోగలం (లూకా 6:36).


3. కనికరం చూపడానికి నిరాకరించడం అంటే మనలో కృతజ్ఞత లేదని అర్థం (మత్తయి 18:21-35).


4. కనికరం జ్ఞానం నుండి వచ్చేది.

"అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది (యాకోబు 3:17)


5. తీర్పును మించి జయించేది కనికరం.

కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును. (యాకోబు 2:13)

తీర్పుకు తగిన సమయం ఉంటుంది, కాని తీర్పును కనికరంతో కొట్టివేసే సమయాలు కూడా ఉంటాయి (1).


నీవు కనికరాన్ని ప్రేమిస్తున్నావా? (మీకా 6:8)


కనికరముగలవారు ధన్యులు


--------------


నోట్ :
కనికరం, కృప రెండూ కొంచెం ఒకే అర్ధం ఇచ్చేలా కనిపించినా ఆ రెండూ ఒకటి కాదు. రెంటి మధ్య వ్యత్యాసాన్ని సంక్షిప్తంగా వివరించాలంటే - మన పాపాలకు ప్రతిఫలంగా మనం శిక్షకు అర్హులమైనా దేవుడు  శిక్షించకపోవడం కనికరమైతే, మనకు అర్హతలేకపోయినా దేవుడు మనలను ఆశీర్వదించడం కృప. కనికరం మనలను తీర్పు నుండి తప్పిస్తే, అర్హత లేని మనకు దయను విస్తరింపచేయడమే కృప!


(1) ఎవ్వరికి తీర్పు తీర్చకూడదు అనే బోధ చాలా ప్రఖ్యాత చెందిన రోజుల్లో మనం ఉన్నా, దేవుని వాక్యం మనలను తీర్పు తీర్చమనే ప్రోత్సాహిస్తుంది. కాని అది వాక్యానుసారముగా సరైన పద్దతిలో ఉండాలి. కాని చాలా ముఖ్యమైన సందర్భాల్లో తీర్పును కనికరం జయించింది. దానికి ఉన్నతమైన ఉదాహరణ : పశ్చాతాపపడిన వారికి దేవుడు రక్షణ అనుగ్రహించడం (రోమా 6:23). ఇంకొన్ని ఉదాహరణలు : మేలు చేత కీడును జయించడం (రోమా 12:21), కీడు చేసిన వారిని సహించి, క్షమించడం (కొలస్సీ 3:13), ప్రేమతో శత్రువుల కోసం ప్రార్ధించడం (మత్తయి 5:44).


#5: Blessed are the Merciful


కనికరముగలవారు ధన్యులు - అనే అయిదవ ధన్యత గురించి ఈరోజు వాక్యధ్యానం, స్ఫూర్తినిచ్చే కనికరంతో నిండిన సత్యాలను వివరిస్తుంది. నేర్చుకుందామా!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.