#7. సమాధానపరచువారు ధన్యులు!

సమాధానపరచువారు ధన్యులు. అసమాధానపరచువారి నాలుగు లక్షణాలు, సమాధానపరచువారి మూడు లక్షణాలు గురించి ఈరోజు వాక్యధానంలో చూద్దాం!


సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు. (మత్తయి 5:9)


"అసమాధానపరుచువారు" అనేకులు. వారు:

1. సమస్యలు గురించి మాట్లాడటానికి నిరాకరిస్తారు.
2. క్షమించడానికి నిరాకరిస్తారు.
3. వారి లోపాలను ఒప్పుకోవడానికి నిరాకరిస్తారు.
4. వారిని వారు తీర్పు తీర్చుకోవడం బదులు ఇతరులను తరుచూ తీర్పు తీరుస్తారు.


అసమాధానకారకులతో మనం సమాధానపడలేము కాని వారి ప్రవర్తనను పోలిన ప్రవర్తనలోనికి మనం కూడా మారిపోకుండా చాలా జాగ్రత్తపడాలి.


సమాధానపరచువారు చాలా అరుదైనవారు:

1. సమాధానం కోసం వారు చేయగలిగింది చేస్తారు. వారు ఇతరుల వైపు నుండి ఆలోచించి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇతరుల గురించి ఉన్నతంగానే ఆలోచిస్తారు. రోమా 12:18; 14:19.


2. ఇతరులు ఇంకా పరిష్కారానికి రాని వివాదాలు గురించి చర్చిస్తుంటే అక్కడ నుండి వెళ్ళిపోరు. ఇతరులతో సమాధానం లేకపోతే దేవుని సంతోషపెట్టలేరని వారికి తెలుసు. మత్తయి 5:23-24


3. ఇతరుల కోరికలు భావాలు అర్ధం చేసుకోవడానికి ఇష్టపడతారు.. కాని సంబంధాల్లో వారికిష్టమైన నియమాలే పెట్టరు. ఇతరుల ఆలోచనలు విని, సంబంధాన్ని మెరుగు పరచడానికి యదార్ధంగా ప్రయత్నిస్తారు. ఫిలిప్పీ 2:3-4


అందరితో ప్రాణ స్నేహితుల్లాగా ఉండాలని దేవుడేమి ఆశించడు కాని ఇతరులను క్షమించి, వారి వైపు నుంచి ఆలోచించి, దయ చూపాలని ఆశిస్తాడు!


సమాధానపరచువారు ధన్యులు!


సమాధానాన్ని వెంబడించమని నిన్ను ఈరోజు ప్రోత్సాహిస్తున్నాను.


ఈరోజు కొంత ధ్యానించడానికి క్రింది వాక్యభాగాలు :


• శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. (రోమీయులకు 12:18)


• కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. (మత్తయి 5:23,24)


• కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను. (ఫిలిప్పీయులకు 2:3,4)


7: Blessed are the Peacemakers


సమాధానపరచువారు ధన్యులు. అసమాధానపరచువారి నాలుగు లక్షణాలు, సమాధానపరచువారి మూడు లక్షణాలు గురించి ఈరోజు వాక్యధానంలో చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.