# 6: హృదయశుద్ధిగలవారు ధన్యులు

హృదయ శుద్ధిగలవారు దేవుని చూస్తారని మత్తయి 5వ అధ్యాయం చెబుతుంది. దీని అర్థం ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


హృదయ శుద్ధి గలవారు💗 ధన్యులు; వారు దేవుని చూచెదరు. (మత్తయి 5:8)


లోపం లేని వ్యక్తులంటూ ఎవరూ ఉండరు, కాని హృదయ💗 శుద్ధి గలవారు శుద్ధమైన ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు కలిగి ఉండాలని కోరుకుంటూరు. పరిశుద్దాత్మ యొక్క ఒప్పుదలకు వారు వెంటనే స్పందిస్తారు, దేవుని సంతోషపెట్టాలనే కోరిక కలిగి ఉంటారు (ఎఫెస్సీ 5:9-10).


సత్యమునకు భిన్నమైన బోధలు, కల్పనా కథల వైపు తిరగడం కాక, వాక్య సత్యాలకే వీరు కట్టుబడి ఉంటారు (1 తిమోతి 1:3-5)


ప్రతీ క్రైస్తవుడు శుద్ధమైన హృదయం 💗 కలిగి ఉండాలనే దైవాజ్ఞను పొందాడు (1 ధెస్సలొనిక 4:7, 1 యోహాను 3:2-3).


హృదయ  💗 శుద్ధి గలవారు "దేవుని చూస్తారు" ఎందుకంటే వారికి దేవుని గుణాలు గురించిన సరైన అవగాహన ఉంటుంది గనుక (హెబ్రీయులకు 12:14), ఆ అవగాహనే వారికి తాత్కాలికమైనవి కాక శాశ్వతమైనవి చూడగలిగే సామర్ధ్యతనిస్తుంది (2 కొరింధీ 4:18).


యేసును ముఖముఖిగా ఎప్పుడెప్పుడు చూస్తానా అని హృదయ  💗శుద్ధిగలవారు ఆరాటపడతారు, అలా చూసి ఆయన పరిశుద్ధతను, వారిపై ఆయనకున్న ప్రేమను పరిపూర్ణంగా అర్ధం చేసుకుంటారు (1 కొరింధీ 13:12; ప్రకటన 22:3-5).


హృదయ శుద్ధి గలవారు ధన్యులు 💗


హృదయ 💗 శుద్ధిగలవారి కోరికలు ఎలా ఉంటాయో ఫిలిప్పీ 3:7-21 లో వెల్లడయింది. ఈ వాక్యభాగం చదవడానికి కొంత తీసుకోని, వాటిని ఈ వారం అంతా ధ్యానిస్తూ, దేవుణ్ణి హృదయ💗శుద్ధి కోసం వేడుకుందాం!


 💗 💗 💗 💗 💗 💗


నోట్చేర్చబడిన వాక్యభాగాలు పరిశుద్ధత మరియు పవిత్రత గురించి మాట్లాడుతున్నాయి. ఇవి రెండూ ఒకటేలాగా అనిపిస్తాయి. గ్రీకులో పవిత్రత (ప్యూరిటీ) అంటే వేరుపర్చుట, శుభ్రం చేయుట, పాపపు ప్రభావాల నుంచి ప్రక్షాళించుట. కాని గ్రీకులో పరిశుద్ధత (హోలీనెస్) అంటే భిన్నంగా ఉండుట లేక ఒక పనికి ప్రత్యేకపరచుట, దేవుని గుణాలను పోలి ఉండుట అని అర్ధం. పరిశుద్ధతలో పవిత్రత కూడా ఉంటుంది కాని దానికి మించి ఇంకా ఎక్కువ అర్ధం ఇందులో ఉంది!


6: Blessed are the Pure in Heart


హృదయ శుద్ధిగలవారు దేవుని చూస్తారని మత్తయి 5వ అధ్యాయం చెబుతుంది. దీని అర్థం ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.