నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. (మత్తయి 5:10)
తప్పు చేసి లాభం పొందే అవకాశం ఉన్నా, లాభం లేకపోయినా మంచే చేయాలని క్రైస్తవులు దేవుని నుండి ఆజ్ఞ పొందారు (కీర్తన 15:4). కాని ఈ ధన్యత దీనిని మించి మాట్లాడుతుంది. సరైనది చేసినందుకు హింసింపబడటం గురించి ఇది మాట్లాడుతుంది.
క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు (2 తిమోతి 3:12) అని దేవుని వాక్యం వాగ్దానం చేసింది.
ప్రస్తుత ప్రపంచంలో, సరైనది చేయడమంటే దేవుని సత్యాలను నిర్మొహమాటంగా చెప్పడమే (లూకా 9:26).
సృష్టి గురించి మాట్లాడితే, లోకం మనలను "అజ్ఞానులని" వెక్కిరించవచ్చు. దేవుని ప్రేమలోనుండి వచ్చిన ఆజ్ఞల్లో ఒకటి "లైంగిక అనైతికత" అని చెబితే మనలను "ద్వేషించేవారని" వెక్కిరించవచ్చు . అబార్షన్ ద్వారా జీవితం చూడని పసిబిడ్డలు గురించి మాట్లాడితే మనలను "ఎంపికకు వ్యతిరేకులు" అని ముద్ర వేస్తారు.
ఇటువంటి అవమానాలను భరిస్తూనే, సరైనవి చేసుకుంటూ పోవడం ఎలా?
మనం "దేవుని గురించిన మనస్సాక్షి" కలిగినవారం గనుక ఈ వెక్కిరింపులను భరించగలం అని 1 పేతురు 2:19 చెబుతున్న సత్యం.
8: Blessed are Those Who are Persecuted for Righteousness
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.