9#. జనులు మిమ్మును నిందించినయెడల మీరు ధన్యులు!

ఈ వాక్యధ్యానం ఎనిమిదవ ధన్యతలోని రెండవ భాగం. ఇది మనకు ఎంతైనా మేలుకరం! ❤


నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. (మత్తయి 5:11,12)


మనం ఇతర దేశాల్లో హింసింపబడుచున్న క్రైస్తవులు గురించి ప్రార్ధించాలి. మనకున్న కొద్దిపాటి హింసను సిగ్గుపడకుండా ఎదుర్కొంటూ 'వారితో నిలబడాలి'.


యదార్థమైన క్రైస్తవులు ఈ లోకంలో ఎప్పుడూ ప్రసిద్ధి పొందరని యేసు ప్రభువు హెచ్చరించారు :


మీరు లోక సంబంధులైనయెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. (యోహాను 15:19)


మనం ఎంతగా ద్వేషించబడినా, 'క్రీస్తు యొక్క శ్రమలలో కొంతైనా పాలుపొందే ధన్యత' దొరికిందని ఆనందించాలి (1 పేతురు 4:12-13; ఫిలిప్పీ 3:10).


మన కొద్దిపాటి శ్రమలు, దేవునిలో మన అన్నలు చెల్లెల్లు అనుభవిస్తున్న కఠినమైన శ్రమలను గుర్తుచేసే జ్ఞాపికలు (1 కొరింధీ 12:26).


యేసు ఆయన అనుచరుల ప్రసిద్ధిని వివరించిన మరికొన్ని వచనాలు :


• క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు. (2 తిమోతి 3:12)


• మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతము వరకును సహించినవాడు రక్షంపబడును. (మత్తయి 10:22)


• ... ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు. (యోహాను 15:24)


• ... మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. (మత్తయి 24:9)


• లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. (యోహాను 15:18)


• ... మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. (యోహాను 16:2)


9: Blessed are You When People Insult You


ఈ వాక్యధ్యానం ఎనిమిదవ ధన్యతలోని రెండవ భాగం. ఇది మనకు ఎంతైనా మేలుకరం! ❤


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.