మనం గనుక యెషయా గ్రంధం యొక్క నైపద్యం చదివితే, జనులు విగ్రహారాధనలో, అత్యాశతో కూడిన ఆచారాలలో, అవినీతిలో మునిగిపోయి, దేవుణ్ణి ఘనపరుస్తున్నామనే నటించే రోజుల్లో యెషయా ప్రవచించాడు.
సరిగ్గా అదే ఈరోజుల్లో కూడా నిజం.
• మనం దేవునితో ఏకాంత సమయం గడపడం, మానక సంఘంగా కూడటం ఎంతో ప్రాముఖ్యం అయినప్పటికీ, లోకానుశారమైన ధ్యేయాలు, స్వార్ధ కోరికలపై మన జీవిత గురి ఉంటే, మనం పైన చేసే ఆ ముఖ్యమైన వాటికి అర్ధం లేదు.
• మారని దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం నొక్కి చెప్పడం ముఖ్యమే కాని, అబార్షన్ను, అనైతిక అలవాట్లను, ఇంకా ఈరోజుల్లో లోకం అమోదించే పాపలను సమర్థిస్తే, పైన ముఖ్యమని చెప్పే వాటికి అర్ధమే లేదు.
ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు "ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి. కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ. (యెషయా 29:13-15)
మనం ఇతరులను మోసం చేయొచ్చు (మత్తయి 6:1), కొందరైతే వారిని వారే మోసం చేసుకుంటారు (మత్తయి 7:21-23), కాని దేవుణ్ణి మాత్రం ఎవ్వరు మోసం చేయలేరు (గలతీ 6:7-8).
కనుక మన విశ్వాసం విషయంలో మనం ఖచ్చితంగా ఉండేలాగ జాగ్రత్త వహించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను (యోహాను 4:24) అనే సత్యాన్ని గుర్తుచేసుకుంటూ, మన రహస్య పాపాలను, అబద్ధ ఉద్దేశాలను పశ్చాతాపంతో దేవుని దగ్గర ఒప్పుకోవాలి!
Honoring God with Words, Not Hearts
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.