దేవుడు యోబును ఈ విధంగా వర్ణించారు :
అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతనివంటివాడెవడును లేడు. (యోబు 1:8)
కాని ఎప్పుడైతే యోబు తన బిడ్డలను, ఆస్తిని, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడో, అతన్ని 'ఆదరించడానికి' వచ్చిన తన స్నేహితులు, దేవునికి అతని మీద కోపమే తన కష్టాలకు కారణం అని చెబుతూ చాలా ఘంటలు గడిపారు.
ఆస్తిని, బిడ్డలను పోగొట్టుకుని, ఒంటినిండా కురుపులతో బాధపడుతూ బూడిదలో కూర్చున్న వ్యక్తికి అతని స్నేహితులు ఇంకా బాధను ఎక్కువ చేశారు.
• విచారం ఏమిటంటే, చాలా మంది క్రైస్తవులు యోబు స్నేహితుల్లాగే ఆలోచిస్తారు. తోటి విశ్వాసికి ఏదైనా చెడు జరిగితే, అతను ఏదో తప్పు చేసాడు కాబట్టే అలా జరిగింది అని అనుకుంటారు.
• ఒక క్రైస్తవునికి అనారోగ్యం వస్తే, వారికి సరిపడా విశ్వాసం లేదు అని సలహాలిస్తుంటారు. దుఃఖంతో ఉన్న తల్లిదండ్రులతో ఆదరణ పేరుతో, ఆ బిడ్డ యొక్క చెడు ఎంపికకు ఆ తల్లిదండ్రులే బాధ్యులు అని కూడా సలహాలిస్తుంటారు.
కాని దేవుడు "మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు" (యోబు 42:7) అని యోబు స్నేహితులనే ఖండించారు.
కొన్ని జరగడానికి కావాలని పాపాన్ని ఎంచుకోవడమే కారణం కావొచ్చు. ఉదా : త్రాగుబోతు నడిచే వ్యక్తిని ఢీ కో్టొచ్చు, స్మోకర్ కి ఊపిరి తిత్తుల కాన్సర్ రావొచ్చు లేదా దొంగ పట్టుబడొచ్చు. కాని స్పష్టమైన కారణం లేకుండా ఉన్న సందర్భాల్లో, కొత్తది మనం కనిపెట్టకూడదు.
కనుక సమస్యలలో ఉన్న వారిని చూసి వారి సమస్యలకు వారినే నిందించాలి అని అనిపించినప్పుడు, దేవుని దగ్గర వారిపై కనికరాన్ని, వారిని అర్ధం చేసుకునే బుద్ధిని ఇమ్మని అడుగుదాం!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.