ప్రత్యేకమైన పాపాలను జయించడానికి సులభమైన పద్ధతి!!

కొన్ని సంవత్సరాలక్రితం నాలో ఉన్న ప్రత్యేకమైన పాపాలను జయించే పద్దతిని కనుగొన్నాను. మీరు కూడా పూర్ణ హృదయంతో ఈ పద్దతిని పాటిస్తే తప్పకుండ ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది.


కోపం, ప్రతికూల భావాలు, వాయిదా వేయడం, నిర్లక్ష్యం, చేదు, చింత, అసూయ లాంటి వాటిని జయించడం నీకు కష్టంగా ఉందా?


కొన్ని సంవత్సరాలక్రితం నేను ఇలాంటి ప్రత్యేకమైన పాపాలను జయించడానికి సులభమైన పద్ధతిని కనుగొన్నాను. హృదయపూర్వకంగా, నిజాయితీగా ప్రయత్నించే వారికెవరికైనా ఈ పద్దతి బాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను.


నేను చేసేది ఏమిటంటే :

నేను ఏ పాపాలను జయించలేక విడుదల కోసం ప్రయత్నిస్తున్నానో వాటికి సంబంధించిన బైబిల్ వాక్యాలను చిన్న కార్డ్స్ మీద వ్రాసుకోని, రోజుకు కనీసం 2-3 సార్లు చదువుతూ ధ్యానిస్తాను.


ఇది చాలా సాధారణమైన పద్దతిగా అనిపించినా, దేవుని వాక్యం సజీవమైనది బలమైనది, హృదయ లోతులోనికి దూసుకుపోయే శక్తి గలది గనుక తప్పక ఇది ఉపయోగపడుతుందని చెప్పగలను (హెబ్రీ 4:12).


ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపనిస్తామో (కలస్సీ 3:16), తప్పక దేవుని వాక్యం యొక్క ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరుతుంది (యెషయా 55:10-11).


నిజమే, మనల్ని మనం మార్చుకోలేం. కాని దేవుని పరిశుద్దాత్మ మరియు దైవవాక్యం మనలను మార్చగలవు. అప్పుడు కీర్తనాకారుడు వలే మనం కూడా చెప్పగలం "నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను" అని. (కీర్తనలు 119:11)


A Practical Way to Deal with Specific Sins


కొన్ని సంవత్సరాలక్రితం నాలో ఉన్న ప్రత్యేకమైన పాపాలను జయించే పద్దతిని కనుగొన్నాను. మీరు కూడా పూర్ణ హృదయంతో ఈ పద్దతిని పాటిస్తే తప్పకుండ ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది.


 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.