దేవుడు మన పాపాలను తుడిచివేస్తాడు!

 

ఈరోజు వాక్యధ్యానం పెన్సిల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు (ఎందుకు వాటికి పసుపు రంగు వాడతారు?) మాత్రమే గాక క్షమాపణ గురించిన అద్భుతమైన సత్యాలను కూడా వివరిస్తుంది.

పెన్న్సిల్స్ను ఎందుకు పసుపు రంగుతో పెయింట్ చేస్తారో నీకు తెలుసా?


అత్యుత్తమమైన గ్రాఫైట్ 1800 లో చైనా నుండి వచ్చింది.. ఈ పసుపు రంగును వారు రాజరికపు రంగుగా భావిస్తారు గనుక, ఈ రంగు వేయడంలో వారి ఉద్దేశం అత్యుత్తమమైనది అందించాలని. వింత ఏమిటంటే, ఇప్పుడు పసుపు రంగు పెన్సిల్స్ చాలా సాధారణం అయిపోయి, ఎంతమాత్రము రాజారికానికి గుర్తుగా లేవు.


అసలు పెన్సిల్స్ ఎందుకు అంత తేలికగా ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి అంటే అవి మన సొంత భావాలను చూపే ఒక విప్లవాన్ని తీసుకొచ్చాయి గనుక. ఇవి రాతి మీద చెక్కబడిన దానికి లేక చర్మపు కాగితం మీద వేసే సిరాలకు భిన్నంగా ఉండి, మనుషులు తమ తప్పులను తుడిచి వేసుకోవడానికి అవకాశాన్నిస్తున్నాయి.


అందుకనినేమో మనకు కంప్యూటర్ అంటే అంత ప్రేమ. ఇది పెన్సిల్ కంటే ఇంకా మంచి ఎంపిక. ఒక ఎరేజర్ అవసరం కూడా లేకుండా, మన తప్పులను తుడిచివేసుకోవడానికి ఒక డిలీట్ బటన్ నొక్కి, మళ్ళీ మొత్తం నూతనంగా మొదలుపెట్టొచ్చు.


కాని దేవుడు మనుషులు కనిపెట్టిన వీటన్నింటికంటే మించినవాడు :

యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లనివగును. (యెషయా 1:18)


చట్టపరముగా మనకు విరోధముగా నమోదు చేయబడిన మన పాపాలను మన దేవుడు "తుడిచివేయడం" మాత్రమే గాక, చెరగని శాశ్వతమైన సిరాతో "పూర్తిగా చెల్లించబడింది" అని వ్రాసి సంతకం చేశారు. (గలతీ 3:10-14)


ఈ అద్భుతమైన సత్యాన్ని మనం రోజూ మర్చిపోకుండా తలుచుకోవాల్సిందే (కీర్తన 103:1-3).


God Erases Our Sins


ఈరోజు వాక్యధ్యానం పెన్సిల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు (ఎందుకు వాటికి పసుపు రంగు వాడతారు?) మాత్రమే గాక క్షమాపణ గురించిన అద్భుతమైన సత్యాలను కూడా వివరిస్తుంది.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.