నువ్వు చెయ్యని తప్పుకు ఎవరైనా నిన్ను నిందించారా? పౌలుకు కూడా ఇదే సమస్య ఎదురైంది (ఫిలిప్పీ :15-18; 2 తిమోతి 4:14). అందుచేత 1 కొరింధీ 4:1-5 లో దేవుడు పౌలు చేత దీని గురించి వ్రాయించడంలో ఆశ్చర్యం లేదు.
ఇతరుల అభిప్రాయాలను గాని మన సొంత అభిప్రాయాలను గాని మనం నమ్మకూడదని పౌలు చెబుతున్నాడు. కాని యేసు క్రీస్తు తిరిగి వచ్చే వరుకు కొన్ని చీకటి రహస్యాలు, వ్యక్తిగత అభిప్రాయాలు బయలుపరచబడకపోయినా, దేవుని తీర్పును మాత్రమే మనం నమ్మగలం.
ఈ జ్ఞానాన్ని మన జీవితాలకు ఈ విధంగా ఉపయోగించవచ్చు :
1. మనలను మనం నమ్ముకోకుండా, వాక్యంలో ఉన్న దేవుని నడిపింపును, దిద్దుబాటును నమ్మి, శుద్ధమైన మనస్సాక్షిని కలిగి జీవించుట. (2 తిమోతి 3:16).
2. ఇతరులు నిన్ను తప్పుగా, అన్యాయంగా నిందించినా లేక నిన్ను చెడుగా చూపించడానికి పరిస్థితులను నీకు వ్యతిరేకంగా ఉపయోగించినా, నిన్ను గురించిన నిజమైన ఆమోదం, ఆదరణ దేవునిలో ఉందని నమ్మి విశ్రమించుట. (2 కొరింథీ1:3-5).
3. ఇతరుల నిరాధారమైన ఆరోపణలను నిరాకరించుట (కీర్తనలు 17:4).
అపనిందలు మనలను ఎంతో గాయపరచవచ్చు కాని అవి మనలను మేలు చేయలేనివారిగా మార్చనివ్వకూడదు. ఎందుకంటే "మనము మేలు చేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము". (గలతీయులకు 6:9)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.