ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి?

కొన్నిసార్లు దేవుడు మన నుండి మంచి పోరాటాన్ని పోరాడాలని కోరతాడు, కాని ఇంకొన్నిసార్లు దీనికి భిన్నమైనది కోరతాడు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


నిర్గమకాండము 14 లో ఇశ్రాయేలీయులకు భయాందోళనలు పట్టుకున్నాయి. దగ్గరకు వస్తున్న ఐగుప్తియులు వారిని తప్పక చంపేస్తారని వారు రూడిగా నమ్మారు. ఇంక వారు ఏమి చేయలేని స్థితికి వచ్చేసారు.


అప్పుడు మోషే ఈ ఆజ్ఞలు ఇచ్చాడు (13:14 వచనాలు):


1. భయపడకుడి.
2. స్థిరంగా ఉండుడి.
3. ఊరక నిలిచి ఉండి చూడుడి.


ఇంక మిగతా కథంతా మనకు తెలిసినదే. వారు ఎర్ర సముద్రం దాటి ఆరిన నేలపై నడిచి వెళ్తారు.


ఇశ్రాయేలీయులులానే కొన్నిసార్లు మన విశ్వాసం కూడా దాడికి గురవుతుంది.. అప్పుడు మనం కూడా ఏమి చేయలేము.

అలాంటప్పుడే మనం :


1. భయపడటానికి నిరాకరించాలి.
దేవుడు మనతోనే ఉన్నారని నమ్మాలి (యెషయా 41:10).

2. స్థిరంగా ఉండాలి.
మనకు కనిపించని దేవుని ఉద్దేశాలపై నమ్మకం కలిగి ఉండాలి (హెబ్రీయులకు 11:1).

3. ఊరక నిలిచి ఉండి చూడాలి.
మన సామర్ధ్యంపై కాక దేవుని సామర్ధ్యంపై నమ్మకం పెట్టుకోవాలి (కీర్తనలు 37:7; కీర్తనలు 40:1; కీర్తనలు 46:10; విలాపవాక్యములు 3:26). 


14వ వచనం కీలకమైనది : "యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును." (నిర్గమకాండము 14:14)


అనేక సందర్భాల్లో మన చురుకైన ప్రమేయం అవసరం మరియు మంచి పోరాటాన్ని దేవుని అజ్ఞానుసారం పోరాడాలి (1 తిమోతి 6:12). కాని ఇతర సందర్భాల్లో మన భయాలతోనే మనం పోరాడాలి. ఎలాగంటే, మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడం ద్వారా, ఊరక నిలిచి ఉండటం ద్వారా, మన బదులు దేవుణ్ణి యుద్ధం చెయ్యనివ్వడం ద్వారా.


ప్రియమైన ప్రభువా, ఎప్పుడు పోరాడాలో , ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయి!


When to Fight and When to be Still


కొన్నిసార్లు దేవుడు మన నుండి మంచి పోరాటాన్ని పోరాడాలని కోరతాడు, కాని ఇంకొన్నిసార్లు దీనికి భిన్నమైనది కోరతాడు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.