"నీకు తెలియని సమాచారంతో దేవుడు నిన్ను ముందుకు నడిపించలేడు" - రాల్ఫ్ వింటర్
ఒక విద్యార్థి, శస్త్రవైద్యుడు కాకముందు ప్రాథమిక అంశాలను నేర్చుకోని, అప్పుడు ఇంకా తీవ్రమైన విద్యాభ్యాసంలోనికి, తరువాత సాధనలోనికి వెళ్తాడు. తన లక్ష్యం చేరుకున్నాక కూడా, ఆ జ్ఞానాన్ని ఇంకా అప్డేట్ చేసుకుంటూ, ఇంకా ఎక్కువ చదువుకుంటూ, నేర్చుకున్న కొత్త అంశాలను ఉపయోగిస్తుంటాడు.
అలా చేయకపోతే, మనుషుల జీవితాలను అతను ఫణంగా పెట్టినట్టే.
క్రైస్తవులు కూడా దేవుని ఇంకా తెలుసుకోవాలనే తమకున్న పిలుపును నెరవేర్చడానికి ఉద్దేశపూర్వకమైన ప్రణాళికలు కలిగి ఉండాలి, ఎందుకంటే ఇలాంటివి వాటంతట అవే జరిగిపోవు గనుక (ఫిలిప్పీ 2:12-13).
బైబిల్ మనకు ఇచ్చే ఆజ్ఞలు ఏమిటంటే :
• 1. మొదటగా ప్రాథమికమైనవి నేర్చుకోని, ఆచరణలో పెట్టాలి - "నిర్మలమైన వాక్యమను పాలను అపేక్షించాలి " (1 పేతురు 2:2-3).
• 2. అప్పుడు విశ్వాసంలోనికి లోతుగా వెళ్ళాలి - "బలమైన ఆహారం తినాలి" (1 కొరింథీయులకు 3:1-2; హెబ్రీయులకు 5:12; 2 తిమోతి 2:15).
చాలామంది విశ్వాసులు, మన సమాజంలో ప్రబలమైన తప్పుడు సిద్ధాంతాలతో దారి తప్పిపోతున్నారు (కొలస్సీయులకు 2:8). వీరు "జ్ఞానంలేనివారై నశించిపోతున్నారు". దీనికి కారణం వీరు విశ్వాసంలో ఎదగడానికి ఎటువంటి ఉద్దేశపూర్వకమైన ప్రయత్నాలు చేయకపోవడమే (హోషేయ 4:6).
మనం ఉద్దేశపూర్వకంగా ఉందాము ప్రియ క్రైస్తవులారా! ఎందుకంటే మన జీవితాలు, మన ప్రాణాలనే కాదు, మనం ప్రభావం చేసే ఇతరుల ప్రాణాలను కూడా ఫణంగా పెడతాయి గనుక!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.