దేవుని వాక్యం పొరపాటులేనిదని నమ్మటం!

 

దేవుని వాక్యం పొరపాటులేనిదని నమ్మటం అంటే అర్ధం ఏమిటి? దీని అసలైన అర్ధం ఏదో ఏది కాదో ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!

దేవుని వాక్యం పొరపాటులేనిదని నమ్మటం క్రైస్తవ విశ్వాసంలో అతిముఖ్యమైన సిద్ధాంతం. (హెబ్రీయులకు 4:12 మరియు  2 తిమోతి 3:16-17 చూడండి)


~ దాని అర్ధం ఏమిటంటే :


1. బైబిల్ పూర్ణంగీకారయోగ్యమైనది, ఖచ్చితమైనది, సత్యమైనది.


2. అది మనుష్యుల చేత వ్రాయబడినదైనా, ప్రతీ లేఖనం దైవావేశం వలన కలిగినది. దేవుని వాక్యం మనిషి చేత మలినమైనది కాదు లేక పక్షపాతానికి గురైనది కాదు. (1)


అలాగని లేఖనభాగాలను మనం ఉన్నది ఉన్నట్లు తీసుకోకూడదు.

బైబిల్ లో కొన్ని చోట్ల అలంకారిక భాష వాడటం జరిగింది.. దానిని ఉన్నది ఉన్నట్లు తీసుకోకూడదు. (2)


అలాగని ప్రతీ సంస్కృతి బైబిల్ సిద్ధాంతాలను ఒకే రీతిగా వర్తించుకుంటాయని కాదు. బైబిల్ సిద్ధాంతాలు సార్వత్రికమైనవే అయినప్పటికీ, వాటి వర్తింపు ఒకొక్క సంస్కృతికి వేరుగా ఉంటుంది (ఉదా : నిరాడంబరత)


అలాగని ప్రతీ అనువాదం (తర్జుమా) ఏ లోపంలేనిదని కాదు. కొన్ని అనువాదాలు కొన్నింటికంటే ఇంకొంత ఎక్కువ ఖచ్చితత్వం కలిగి ఉన్నాయని అర్థం. (3)


అలాగని వాటి సంబంధిత సంస్కృతి మరియు చరిత్ర మనం తెలుసుకోకూడదని కాదు. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు మరియు పరిస్థితులు వాటి సంబంధిత సంస్కృతి మరియు చరిత్ర తెలుసుకోవడం ద్వారానే అర్ధంచేసుకోగలం. కాని సంస్కృతి మరియు చరిత్ర కొత్త నిబంధనలోని ఆజ్ఞలను, సిద్ధాంతాలను ఏమి తిరస్కరించవని గుర్తుపెట్టుకోవాలి.


బైబిల్లో ఉన్న ప్రతీ లేఖనభాగం మనకు అర్థంకాకపోవచ్చు, కాని అది "దైవావేశం" వలన కలిగినదని మనకు తెలుసు.. దైవావేశం అంటే ఒక కవి భాషలో వందశాతం ఖచ్చితమైనదని చెప్పడం అనమాట!


నోట్స్ :


(1) ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి. (2 పేతురు 1:20,21)

ఇందులో పాత నిబంధన కూడా ఉంది.


రోమీయులకు 15:4 - ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.


పేతురు కూడా పౌలు పత్రికలను లేఖనాలని సూచించడం 2 పేతురు 3:14-16 లో చూడగలం.


లేఖనాలలో కొన్ని భాగాలు మనిషి మాటలుగా తీసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే, లేఖనాలలో ఉన్న ప్రతీదీ - ఉదా : క్షమాపణ, కృప, రక్షణ వంటివి కూడా సందేహించాలి మరి!


(2) దేవుని వాక్యం పొరపాటులేనిదని నమ్మటం అంటే భూమి సమమైనది, చెట్లు చప్పట్లు కొడతాయి అని నమ్మడం కాదు.


(3) దేవుడు ఆమోదించిన అనువాదం ఇదొక్కటే అని చెప్పే వారి వాదనలలో దయచేసి చిక్కుకోకండి.


(4) ఎందుకు దేవుడు లోతు తన కూతుర్లను దుర్వినియోగం చేయనివ్వడానికి అనుమతించాడు కాని దేవదూతలను కాదు (ఆదికాండము 19:8) అని ఈ మధ్య ఒకరు నన్ను అడిగారు. అది దేవుడు ఆమోదించినది కాదు. లేఖనాల్లో ఉన్నంతమాత్రానా అది దేవుడు ఆమోదించినట్లు కాదు. లోతు యొక్క చర్యలు రెండు సందర్భాల్లో చెడుగానే ఉన్నాయి. ఇది గనుక మనుషులు తయారుచేసిన 'మతం' అయితే వారు అన్నిటిని సర్దేసి, దేవుని పిల్లలను ఏ లోపం లేనివారుగా చూపించే ప్రయత్నం చేస్తారు. కాని దేవుడు తన ప్రజల జీవిత చరిత్రలను యదార్ధంగా వారి పాపాలతో సహా ఉన్నది ఉన్నట్లుగా మన ముందు పెట్టాడు. ఉదా : దావీదు, అబ్రహాము మొదలైనవారు.


Believing God's Word Is Inerrant


దేవుని వాక్యం పొరపాటులేనిదని నమ్మటం అంటే అర్ధం ఏమిటి? దీని అసలైన అర్ధం ఏదో ఏది కాదో ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.