కారణం లేకుండానే వారు చనిపోయారా?

ఇద్దరు వ్యక్తుల అద్భుతమైన సమర్పణ గురించి ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!


ప్రమాదకరమైన ఆఫ్రికా సుడాన్ ప్రాంతానికి మిషనరీలుగా వెళ్ళడానికి ఏ మిషన్ సంస్థ స్పాన్సర్ చేయకపోవడంతో, 1893 లో టామ్, వాల్టర్, రౌలాండ్ అనే వారు అక్కడికి స్వంతంగా వెళ్తారు.


అక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజలకు సువార్త ప్రకటించాలనే ప్రయత్నాలు చేస్తూ విఫలమై, ఆ ప్రయత్నాల మధ్యలోనే వ్యాధులు సోకి, సంవత్సరం తిరగకుండానే టామ్, వాల్టర్ చనిపోతారు.


దీని అర్ధం, వారి జీవితం పనికిరానిదిగా వృధా అయిపోయిందనా?


కానే కాదు.


సరిగ్గా చనిపోయే ముందు వాల్టర్ గౌయన్స్ ఈ క్రింది మాటలు వ్రాసాడు :


"దేవునికి మహిమ కలుగును గాక! నా జీవితం పూర్తి ఓటమిలా, ఒక వైఫల్యంలా అనిపించినా, అది నిజం కాదని నేను చెప్పగలను. ఎందుకంటే సుడాన్ కోసం కఠినమైన పోరాటాన్ని పోరాడటానికి దేవుడే నాకు ఆ సామర్ధ్యాన్నిచ్చాడు. మనం తప్పక విజయం సాధిస్తాం. ఈ సాహసాన్ని తలపెట్టినందుకు నేనేమీ విచారపడట్లేదు. ఎందుకంటే ఇలాగైనా నా జీవితం వ్యర్థమయిపోలేదు గనుక"


వెళ్లిన వారిలో రౌలాండ్ బింగ్హం ఒక్కడే బ్రతికి, సూడాన్ లో ఒక మిషన్ నెట్వర్క్ విజయవంతంగా స్థాపించగలిగాడు.


నువ్వు కూడా దేవుడు కోరాడని ఏదైనా చేసావా, కాని దాని ఫలితం నువ్వు ఊహించినట్టు లేదా?


నేను చేసాను. కాని ఎప్పుడైతే నేను దేవుణ్ణి పూర్తిగా నమ్మి ఆయన చిత్తాలకు లోబడతానో, ఫలితాలకు మాత్రం నేను భాధ్యురాలను కానని నేర్చుకుంటున్నాను.


మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. (రోమీయులకు 14:8)


నా ఒకే కోరిక - దేవునికి పూర్తి విధేయత చూపడం. 


పౌలు వివరించినట్టుగా :

"... నా బ్రదుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు..." (ఫిలిప్పీయులకు 1:19,20)


----------


ఇంకో ఉదాహరణ : ఈ కధ, నాకు నలుగురు హతసాక్షుల కథను గుర్తుచేసింది. వీరు 1956 లో ఎక్యూడోర్ స్థానికులకు సువార్త ప్రకటించడానికి వెళ్ళి హతసాక్షులైపోయారు. వీరి మరణం కొందరికి ఓటమిలాగా కనిపించొచ్చు. కాని వీరి సాక్ష్యం అనేకమంది రక్షణకు, వీరిని చంపిన వారి రక్షణకు కూడా దారితీసింది.


Did They Die for No Reason?


ఇద్దరు వ్యక్తుల అద్భుతమైన సమర్పణ గురించి ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.