నీవు ఎవరికోసమైనా "పోరాడుతున్నావా"?
సాధారణంగా 'పోరాడుట' అంటే ప్రతికూలమైనదిగా ఆలోచిస్తాం, కాని కొన్నిసార్లు అది మంచిదే.
పౌలు, క్రీస్తు కోసం ఎలా జీవించాలో బోధించడానికి దేవుని సంపూర్ణ బలముతో 'పోరాడాడు' (కొలస్సీ 2:1-4). అతని ఉద్దేశం ఏమిటంటే వారు :
❤ హృదయములలో ఆదరణ పొందాలని
❤ ప్రేమయందు అతుకబడాలని
❤ దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలని
❤ చక్కని మాటల చేత మోసపరచబడకుండా కాపాడబడాలని
పౌలు ఒక శక్తివంతమైన ప్రసంగీకుడు, ప్రతీ మనుష్యునికి బుద్ధిచెప్పుచు, బోధించాడు (1:28). మనందరికీ పౌలుకున్న వరాలు గాని, పిలిపు గాని ఉండకపోవచ్చు, అలాగని మనం ఇతరుల గురించి 'పోరాడటం' నుండి తప్పుకోనక్కర్లేదు.
• మనందరం పోరాడటానికి పిలువబడ్డామని, పోరాడే ఒక మంచి మార్గం చూపించాడు పౌలు... అదే ప్రార్ధన (1:9)
బహుశా మన సాక్ష్యాన్ని రక్షణ లేని పొరుగు వారు, కలిసి పని చేసే వారు లేక కుటుంబ సభ్యులు త్రోసివేయచ్చేమో. లేదా తప్పు త్రోవలో ఉన్న తోటి విశ్వాసి గురించి మనకున్న ఆందోళనను అతను తిరస్కరించవచ్చు.
అయినప్పటికీ క్రీస్తు యొక్క సంపూర్ణ బలముతో మనం విశ్వాస్యత కలిగి పోరాడొచ్చు.. ఎలాగంటే వారికోసం తరుచూ ప్రార్ధన చేయడం ద్వారా.
కాబట్టి ఈరోజు కొంత సమయం తీసుకోని నీకు తెలిసిన ఆ ఒక్క వ్యక్తి కోసం "పోరాడు"!
Struggling with all of God's Energy


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.