దేవుని శిక్షా సమయం

పాత నిబంధనలో దేవుడు అన్ని దేశాలను నాశనం చేయడం అనే చరిత్రను చదివి దేవుడు కఠినాత్ముడని ఆలోచిస్తున్నావా? అయితే ఈరోజు వాక్యధ్యానం నీకు చాలా అవసరం.


ఒకవేళ ఒక గదిలోకి వెళ్ళినప్పుడు ఈ సంఘటన చూసారేమో :


"టామీ, ఈ బొమ్మలు సర్దు"
ఏ బొమ్మలు, అమ్మా? "
అవిధేయత చూపినందుకు ఇంకో మాట మాట్లాడకుండా అమ్మ టామీని వేరే గదికి పంపించేస్తుంది.

ఈ సందర్భం చూసిన మనకు ఆమె చాలా కఠినమైనదనే అభిప్రాయం కలగొచ్చు.

కాని ఈ సంఘటన కంటే ఒక ఘంట ముందు గనుక మనం వచ్చి చూస్తే, ఆ గదిలో అమ్మ టామీని ప్రేమగా కౌగిలించుకొని, బొమ్మలు సర్దమని మృదువుగా చెప్పడం, తరువాత అరగంటకి అతనికి మళ్ళీ గుర్తుచేయడం తరువాత పదిహేను నిమిషాలకు వచ్చి అతిధులు వచ్చేస్తారు త్వరగా సర్దు లేకపోతే నిన్ను శిక్షిస్తాను అని చెబుతుందనుకోండి.

ఆమెను ఒక కఠినమైన వ్యక్తిగా కంటే, సహనం ఉన్న వ్యక్తిగా, చాలా సహనం ఉన్న వ్యక్తిగా చూస్తాం.

ఆమె అడిగింది తగినదేనని, టామీ స్పందన తిరుగుబాటుగా ఉందని అర్ధం చేసుకోగలం.

• ఆమె శిక్షా సమయం చాలా ముఖ్యం.

పాత నిబంధన సమయంలో పట్టణాలన్నింటిని దేవుడు నాశనం చేయడం, ప్రస్తుత పాపాలు గురించి శిక్షించడం, లేదా భవిష్యత్తులో ప్రజలను నరకానికి పంపడం, గురించి జనాలు కూడా దేవుణ్ణి కఠినాత్ముడుగా పిలుస్తారు. దీనికి కారణం మొత్తం కధ* తెలుసుకోకుండా, ముగింపును మాత్రమే చూసి వారు ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటున్నారు గనుక.

కాని ఈ అన్నీ సందర్భల్లో, దేవుడు ఎంతో దీర్ఘశాంతుడు. మన యోగ్యతకు మించి ఎన్నో అవకాశాలు ఇచ్చే దేవుడు ఆయన (కీర్తనలు 103:8-14, 2 పేతురు 3:9).

------------------

*దేవుని సహనం, మనుష్యులకు ఎన్నో అవకాశాలు ఇవ్వాలనుకునే ఆయన తపన గురించిన ఒక మంచి ఉదాహరణ కోసం, యోనా పుస్తకాన్ని చదవండి.



పాత నిబంధనలో దేవుడు అన్ని దేశాలను నాశనం చేయడం అనే చరిత్రను చదివి దేవుడు కఠినాత్ముడని ఆలోచిస్తున్నావా? అయితే ఈరోజు వాక్యధ్యానం నీకు చాలా అవసరం.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.