చాలా మంది అబద్ద బోధకులు బైబిల్ ని ఆధారం చేసుకునే చెప్తారు గనుక నేను బైబిల్ ని నమ్మడం మానేసాను అని ఒకామె నాతో చెప్పింది.
ఒక దుకాణంలో కుళ్ళిపోయిన పండ్లను అమ్ముతున్నారనుకో, నువ్వేం చేస్తావు .. పండ్లు కొనడం మానేస్తావా లేక దుకాణం మారుస్తావా? అని నేను అడిగాను.
ఒకటి ఏదైనా దుర్వినియోగం చేయబడుతుంది అని తెలిసి దాన్ని వదిలేస్తే, వివాహం, కుటుంబం, స్నేహాలు... ఇలా అన్నీ వదిలేయాల్సిరావచ్చు.
~ బైబిల్ ఎప్పుడు తప్పు దారి పట్టించదు. వాక్యానుసారంగా లేని సొంత ఎజెండాలను సమర్ధించుకోవడానికి దైవ వాక్యాన్ని వక్రీకరించే వారిదే అసలైన సమస్య.
• బైబిల్ లేకుండా మనకు ఒక ప్రమాణం అంటూ ఉండదు, ఒక అధికారం ఉండదు, సత్యానికి ఆధారమే ఉండదు. బైబిల్ లేకుండా దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేం, ఆయన్ని సేవించలేం.
• నిజం చెప్పాలంటే, కల్ట్స్ లేక అబద్ద భోధకులను బైబిల్ చదవడం ద్వారానే గుర్తించగలం. బైబిల్ లేకుండా అన్నిటిచేత, ప్రతీదాని చేత మోసపోతాం.
అందుకే కొలస్సీ 2:8 లో ఈ విధంగా మనకు హెచ్చరిక వ్రాయబడింది "ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి."
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.