సత్యంతో ప్రేమ, ప్రేమతో సత్యం

సత్యాన్ని ప్రేమతో ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో మనం అర్ధం చేసుకోవాలి. అది దేవునిలో మన ఎదుగుదలకు అత్యంత కీలకమైనది.



తప్పుడు సమాచారం, సగం-నిజాలు, అబద్ద ప్రకటనలతో నిండిపోయిన ప్రపంచంలో ఉంటున్న మనకు దేవుని సత్యం ఎంతో అవసరం.


ఎప్పుడైతే మనం క్రీస్తు యొద్దకు వస్తామో, ఆయన మాత్రమే మార్గం, సత్యం, జీవం అనే వాస్తవాన్ని నేర్చుకుంటాం (యోహాను 14:6). 'కృప సత్యం' ఆయన ద్వారానే కలిగాయి (యోహాను 1:17).


• ప్రేమలేని సత్యం హానికరం : మనం వాక్యానుశారమైన సత్యాలను వ్యంగ్యంగా, అపహాస్యంగా లేక అమర్యాదగా ప్రకటించడం అస్సలు చేయకూడదు. దేవుని క్షమాపణ, కృప గురించి చెప్పడం ఎప్పుడూ మర్చిపోకూడదు.


• సత్యంలేని ప్రేమ హానికరం : అది మనుషులను విడుదలకు నడిపించడం బదులు పాపానికి దాసులను చేస్తుంది (యోహాను 8:32). అది అసలు ప్రేమే కాదు. ఎందుకంటే నిజమైన ప్రేమను సత్యం నుండి విడదీయలేము.


విశ్వాసులతో మాట్లాడినా, అవిశ్వాసులతో మాట్లాడినా, దేవుని సత్యం అనే 'ఉప్పును' కృపాసహితంగా, ఆరోగ్యకరంగా, శక్తివంతంగా అందించాలి (కొలస్సీయులకు 4:6; ఎఫెస్సీయులకు 4:29).


అది ఇతరులకు మాత్రమే కాదు, ప్రకటించే మనకు కూడా ప్రయోజనకరం.. ఎందుకంటే సత్యాన్ని ప్రేమతో ప్రకటించినప్పుడు, అది మనం క్రీస్తు పోలికలోకి మారడానికి ఎంతో సహాయపడుతుంది (ఎఫెస్సీయులకు 4:15).


Truth with Love, Love with Truth


సత్యాన్ని ప్రేమతో ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో మనం అర్ధం చేసుకోవాలి. అది దేవునిలో మన ఎదుగుదలకు అత్యంత కీలకమైనది.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.