మనందరం జీవితంలో ఏదో ఒక సమయంలో అన్యాయానికి గురవుతాము.
కాని దాని వలన కోపం, భయం, పగ, బాధ అనే వైకల్యం మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1. యేసే మన మాదిరి అని గుర్తుపెట్టుకోవాలి. మనం అనుభవించే ఎటువంటి అన్యాయం కూడా యేసు అనుభవించిన దానితో పోల్చడానికి సరిపోదు. ఫిలిప్పీ 2:5-11 చూడండి.
2. యేసు మన బాధను సంపూర్ణంగా అర్ధం చేసుకోగలరని గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన స్థానంలో ఉండి అనుభవించారు కాబట్టి, మన బాధలు ఎటువంటివో ఆయనకు తెలుసు. ఆయన పూర్తిగా మనయెడల జాలి చూపించి, ఆదరించగలడు. హెబ్రీ 2:14-18 చూడండి.
3. నీకు జరిగిన అన్యాయం నిన్ను దానికి బానిసగా చేయనివ్వకు. ఇతరులకు మరియు నీకు అన్యాయం చేసిన వారికి కూడా మేలు చేయడం ద్వారా, నీవు దానిని జయించగలవు. ఇది చేయడం అన్నిటికన్నా కఠినమైనదిగా అనిపించినా, ఇదే నీ స్వాతంత్రానికి అసలైన తాళంచెవి. రోమా 12:21 చూడండి.
4. యేసుతో, ఆయన వాక్యంతో, క్రైస్తవ సహవాసంతో ఎక్కువ సమయం గడిపితే ఇవే నిన్ను ఎక్కువ ప్రభావితం చేస్తాయి, అన్యాయంగా మాట్లాడిన వారి మాటలకంటే. కొలస్సీ 3:15-16 చూడండి.
5. నీకు జరిగిన అన్యాయాన్ని కూడా నీ మేలు కోసం అలానే ఇతరుల మేలు కోసం దేవుడు వాడగలరని నమ్ము. రోమా 8:28 చూడండి.
Mistreated or Misunderstood? These 5 Scriptures Will Help!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.