దేవుని సృష్టి అద్భుతమైనది.
సీతాకాలంలో అక్కడక్కడా దాచిన విత్తనాలను గుర్తుచేసుకోవడానికి, వేసవిలో అలానే ఆకురాలే కాలంలో కోడిపిల్లల మెదడులు పెరుగుతాయని పరిశోధనలో వెల్లడైంది. అప్పుడు కొత్త జ్ఞాపకాలకు స్థానం కల్పించడం కోసం, పాత జ్ఞాపకాలు ఉన్న కణాలను పారవేస్తాయంట.
కొన్నిసార్లు నిరాశ, దుఃఖం, తృణీకారాలు, హృదయ గాయాలు.. అనే చేదు జ్ఞాపకాలను పారవేసే విషయంలో నాకు కూడా అటువంటి సామర్ధ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది.
• కాని క్రీస్తును ఎరిగిన వారు కోడిపిల్లలు లాగా పాత జ్ఞాపకాలతో మెదడులో ఉన్న కణాలను పారవేయడం కంటే మేలైన దానిని అనుభవిస్తారు.
1. క్షమాపణ. మన పాపాలను మనం ఒప్పుకుంటే, దేవుడు పూర్తిగా క్షమిస్తాడు. 1 యోహాను 1:9.
2. ప్రేమ, ఆదరణ. మన బాధను దేవుడు పట్టించుకుంటాడు. కీర్తనలు 56:8; 2 కొరింధీ 1:3-4.
3. ముందుకు నడవడానికి దేవుని శక్తి, బలము ఇస్తాడు (1). ఫిలిప్పీ 4:13; ఎఫెసీ 6:10
4. శాంతి. ఆయనలో విశ్రమిస్తే, ఉన్న ఆశీర్వాదములపై దృష్టి నిలిపితే, క్రీస్తు మనకు శాంతిని అనుగ్రహిస్తాడు. యోహాను 14:27; ఫిలిప్పీ 4:8-9.
5. నిరీక్షణ. ఒక రోజు దేవుడు మన కన్నీటిని పూర్తిగా తుడిచివేస్తాడు. ప్రకటన 21:4
---------------------
(1) దేవుడిని లోతుగా తెలుసుకోవాలి అనే ఆశ మనకుంటే, వెనకున్నవి మరిచి ముందున్న వాటిని వెతుకుడానికి వేగిరపడదాము (ఫిలిప్పీ 3:13-14).
5 Ways God Helps Us Overcome Bad Memories
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.