పుస్తకాలు ఒకప్పుడు చేతితో కాపీ చేయబడేవని నీకు తెలుసా? బైబిల్ మొత్తం పూర్తిగా ఒక్క కాపీ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది.
1440 లో గుటెన్బెర్గ్, ప్రింటింగ్ ప్రెస్ ని కనిపెట్టి, ప్రపంచంలో ఒక విప్లవాన్ని తెచ్చాడు.
మెటల్ లో అక్షరాలను అమర్చడం చేత్తో చేయాల్సివచ్చినా, గుటెన్బెర్గ్ ప్రెస్ ఒక్క సంవత్సరంలోనే వందల పుస్తకాలను ఉత్పత్తి చేయగలిగింది.
గుటెన్బెర్గ్ మొదటి సారి అచ్చువేసిన పుస్తకం బైబిల్. రానురాను బైబిల్ అందురూ కొనుక్కోగలిగిన ధరకి అందరికి అందుబాటులోకి వచ్చింది.
బైబిల్ అందుబాటులో ఉండటం వలన దానికున్న విలువను నేను తక్కువ అంచనా వేస్తుంటాను. నా చేతిలోకి వచ్చిన ఈ అపురూపమైన, పరిశుద్ధమైన పుస్తకం వెనక ఉన్న చారిత్రిక ఘట్టాలు గురించి పెద్దగా ఆలోచించను కాబట్టి నాతో దేవుడు మాట్లాడాలి అని అనుకుంటేనే దానిని తెరుస్తాను.
నేను గనుక జాగ్రత్తపడకపోతే, బైబిల్ చదవడం ఒక భాగ్యం కంటే ఒక భారం అని అనుకునే ప్రమాదం ఉంది.
నువ్వు ఇలా ఎప్పుడైనా అనుకున్నావా?
అలాగైతే కీర్తన 119:18 లో ఒక మంచి ప్రార్ధన ఉంది.. అది చేసుకుందామా..
"నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము."
Preserved, Printed, Precious - God's Word
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.