మనకుండే స్వార్ధపూరిత కోరికలతో మనలను ఆశపెట్టి అటువైపుగా లోపరుచుకోవడానికి దేవుని వాక్యాన్ని వంకరగా తిప్పడం అపవాదికి చాలా ఇష్టం.
వాక్యం విషయంలో మనం అజ్ఞానంగా ఉండటమే అపవాది విజయ రహస్యం.
• ఎఫెస్సీ 2:8-9 ని చూపించి, "సత్క్రియలు" చెడు మాటగా అనిపించేలా చేసి, లోకానుశారమైన జీవితం జీవించడానికి మనలను పురిగొలపగలడు అపవాది.
వాడి ధీమా ఏమిటంటే దాని వెంటనే ఉన్న వచనాన్ని అంటే ఎఫెస్సీ 2:10 లో ఉన్న "సత్క్రియలు చేయడానికే మనం సృష్టింపబడ్డాం" అనేది చదవమని.
• చెడు సహవాసాలతో మనం తిరిగి పాడవ్వాలని అపవాది అనుకుంటే, యేసు కూడా అలాంటి వారిని కలిశారు అని గుర్తుచేస్తాడు (మార్కు 2:13-17).
కాని యేసు పాపులతో ఉన్నప్పుడు వారిని ఎలా సవాలు చేశారో, ఆయన "శిష్యులతోనే ఎక్కువ సమయం ఎలా గడిపారో" (యోహాను 5:14) ఆ సత్యాలను మాత్రం మర్చిపోయేలా చేయగలడు అపవాది. చెడు సహవాసాల నుండి తప్పించుకోవాలి అని ఉపదేశించిన దేవుని వాక్యాన్ని గుర్తురాకుండా చేయగలడు (1 కొరింధీ 15:33).
• వాక్యంలో ఉన్న సత్యాలను కొన్నే పంచుకొని, స్వార్ధపూరితమైన కోరికలకు ఆటంకంగా ఉన్నవి మాత్రం మోసపూరితంగా పంచుకోకుండా ఉండేలా శోధించగలడు అపవాది.
మరి ఇలాంటి అపవాది శోధనలను ఎలా జయించగలం? మనం వాక్యమంతటిని చదవాలి, వాక్యమంతటిని అంగీకరించాలి (2 తిమోతి 2:15), స్వార్ధపూరితమైన కోరికలకు తృణీకరించాలి (మత్తయి 16:24).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.