నవలలో కొన్ని పేజీలు మాత్రమే చదివి, కధ అంతా అర్ధమైపోయిందని ఎప్పుడూ అనుకోము కదా.
• కాని దేవుని వాక్యం విషయంలో మాత్రం ఎందుకలా చేస్తాం?
పాత నిబంధనలో కొన్ని భాగాలు మాత్రమే చదివి, దేవుని శిక్షలు చాలా కఠినమైనవని నిర్ధారించేసుకుంటాం. ప్రార్ధన, ధనం, తీర్పు తీర్చడం, స్వస్థత మొదలైన అంశాలపై దైవిక సూత్రాలను అందించే సంబంధిత వచనాలు ఎన్నో ఉన్నప్పటికీ, ఒకటి రెండు వచనాలను మాత్రమే ఆధారంగా చేసుకొని ఒక నిర్ధారణకు వచ్చేస్తాం.. కేవలం ఒకే సామెతను ఆధారంగా చేసుకొని, పాజిటివ్ గా ఆలోచించాలి అనే కొత్త సిద్ధాంతాన్ని కూడా కనిపెడతాం.
నవలలో ఉన్న సంఘటనల క్రమం మనం మిస్ అయితే అది అంత పెద్ద విషయం ఏమీ కాదు.
కాని దేవుని కధలో ఉన్న ముఖ్యమైన అంశాలు మిస్ అవడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే దేవుని కధ అంటే, అందులో నీది నాది కూడా ఇమిడి ఉంది కాబట్టి.
• అందుకే దేవుడు ఇలా మనతో చెప్తున్నారు :
దేవుని యెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. (2 తిమోతికి 2:15)
దేవుని వాక్యమును చదివి, ధ్యానించుటకు జాగ్రత్తపడదాం!!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.