దేవునికి ఏదైనా జరగకముందే ఏం జరగబోతుందో బాగా తెలుసు. ఆయన పూర్తి చిత్రాన్ని ముందే చూడగలడు. తన మనస్సు మార్చుకునే అవసరం ఆయనకు లేదు.
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? (సంఖ్యాకాండము 23:19)
కాని యోనా కథ ఈ సత్యానికి విరుద్ధంగా ఉంది. నీనెవె ని నాశనం చేస్తానని దేవుడు చెప్పినప్పటికి, ఆయన పశ్చాత్తాపపడి, నాశనం చేయకుండా ఆగిపోయాడు (యోనా 3:10) (1)
కాని ఇందులోకి లోతుగా చూస్తే మనకు అర్ధమయ్యేది ఏమిటంటే అసలు దేవుడు తన మనస్సు మార్చుకోలేదని.. ఎందుకంటే ఈ రకమైన షరతుతో కూడిన హెచ్చరిక వివరణను మనం యిర్మీయా 18:7-8 లో చూస్తాం :
దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పియుండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానినయెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. (యిర్మీయా 18:7,8)
ఒకవేళ నీనెవె పశ్చాత్తాపపడకపోయి ఉంటే, దానిని నాశనం చేసే ప్రణాళికను దేవుడు నెరవేర్చేవాడు.
కాని నీనెవె ప్రజలు పశ్చాత్తాపపడ్డారు కాబట్టి ఇంక ఆ హెచ్చరిక ఇంక వారికి వర్తించదు. ఆయన తట్టు తిరిగిన వారిని క్షమిస్తానని వారికి కనికరం చూపుతానని చెప్పిన దేవుని మారని వాగ్దానాన్ని వారు పొందుకున్నారు.
అదేవిధంగా ప్రతి ఒక్క స్త్రీని, పురుషుడిని పాపం చేశారు గనుక "పాపం వలన వచ్చే జీతం మరణం" (రో్మీయులకు 3:23; 6:23) అని దేవుడు హెచ్చరిస్తున్నాడు.
కాని మనం పశ్చాత్తాపపడి యేసు తట్టు తిరిగితే, ఆ హెచ్చరిక మనకు వర్తించదు (యోహాను 3:16).
దేవుడు తన మనస్సును మార్చుకోడు. ఆయన తట్టు తిరుగని అవిధేయాలపై ఆయన ఉగ్రత స్థిరంగానే ఉంటుంది (యోహాను 3:36), అలానే ఆయన దయ కూడా ఆయనను విశ్వాసించిన వారిపై స్థిరంగానే ఉంటుంది.
దాని మీద ఆధారపడదాం!!
---------------
(1) యోనా ఎందుకు పారిపోయాడో తెలుసుకోవాలనుందా? అయితే యోనా 4:2 చూడండి!
Does God Change His Mind: Nineveh
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.