నువ్వు ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నావు? ఈరోజు, ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరం - దేనిపై నీ దృష్టి?
అపొస్తులుడైన పౌలుకు తాను సిగ్గుపడాల్సిన గతం ఉంది (అపో. కార్యములు 22:4,5), ప్రతీ రోజూ ఎన్నో సవాళ్ళలో కష్టాలలో నడుస్తూ, రోజూ సరిగ్గా తినడానికి కూడా లేని పరిస్థితి, (ఫిలిప్పీ 2:12-13) ద్వేషం, దెబ్బలు, ఓడ బ్రద్దలవడం, చెరశాల - ఇవే అతని జీవితం (2 కొరింధీ 11:24,25).
కాని అసలు పౌలు దేనిపై దృష్టి నిలిపాడు?
సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను. (ఫిలిప్పీ 3:13,14)
మనం ధనవంతులంగా ఉంటూ సుఖవంతమైన జీవితం గడపాలి, దాని కోసమే మనకున్న శక్తినంతా వెచ్చించాలి అని కొన్ని జనాదరణ పొందిన "క్రైస్తవ" బోధల్లో చెప్తుంటారు. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న లోకపు విలువలపై దృష్టి పెట్టి దానిని అలవరుచుకోవాలి అని కూడా చెప్తుంటారు.
కాని మన క్రైస్తవ జీవితం ఒక సులభకరమైన నడక కాదు. మనం ఒక పరుగు పందెంలో ఉన్నాం. దానికి మన పూర్తి శ్రద్ధ చాలా అవసరం. కనుక "మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుతూ" మనకున్న శక్తినంతా ఆయన ఆశయాల కోసం వెచ్చిద్దాం (హెబ్రీయులకు 12:2; ఎఫెస్సీయులకు 2:10)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.