తక్కువ నాణ్యతగల కృపను తృణీకరించి, క్రీస్తు పట్ల మన ప్రేమను రుజువుపరుచుకోవడం

"తక్కువ నాణ్యతగల కృపను" బోధించే సంఘాల బోధలను తప్పించుకునే మూడు మార్గాలు ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!


మనం రక్షణ పొందాము, క్షమించబడ్డాము గనుక దేవుని ఆజ్ఞలకు ఇంక విధేయత చూపడం అవసరం లేదు అనే ఆలోచనతో ఆధునిక క్రైస్తవులు "నాణ్యత లేని కృపను" తరుచూ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కాని అది చాలా పెద్ద తప్పు :


1. మంచి క్రియలు మనలను రక్షించలేవు, కాని నిజమైన విశ్వాసులు మంచి క్రియలు చేస్తారు.


మనము ఎఫెస్సీ పత్రిక 2:8-9 చూస్తాం కాని 10 వ వచనాన్ని చూడనట్టు చేస్తాం.


మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. (ఎఫెసీయులకు 2:8-10)


యాకోబు 2:14-26 "క్రియలు లేని విశ్వాసం మృతం" అని హెచ్చరిస్తుంది.


2. పశ్చాతాపం అంటే పాపం నుండి పూర్తిగా తిరిగిపోవడం.


క్షమాపణ తెచ్చే ఆశీర్వాదం గురించిన అవగాహన మనకున్నా, పాపాన్ని ఒప్పుకోకుండా నిరాకరిస్తే, దేవుణ్ణి అబద్దికుడని మనం పిలుస్తున్నామని, ఇంక మన హృదయంలో వాక్యానికి చోటు ఉండదని గ్రహించం (1 యోహాను 1:8-10).


3. ఆయన కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని క్రీస్తు మన నుండి ఆశిస్తారు.


మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించారనే గ్రహింపు మనకుంది, కాని ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడమే ఆయన పట్ల మనకున్న ప్రేమకు రుజువని మర్చిపోకూడదు (యోహాను 14:23,24).


అవిశ్వాసుల జీవనశైలి ఎలా ఉంటుందో విశ్వాసుల జీవనశైలి కూడా అచ్చం అలానే మారిపోవడం ఈ రోజుల్లో బాగా చూస్తున్నాం. దైవిక నిర్ణయాలు చేయడం బదులు సులభమైన నిర్ణయాలే ఎక్కువ చేస్తున్నాం. క్రీస్తు మనకు చేసిన దానికి కృతజ్ఞత లేకపోవడమే దీనికి కారణం.


యేసును పూర్ణహృదయంతో ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఆయనకు పూర్ణహృదయంతో విధేయత చూపుతాం (యోహాను 14:21).


Rejecting Cheap Grace and Proving Our Love for Christ


"తక్కువ నాణ్యతగల కృపను" బోధించే సంఘాల బోధలను తప్పించుకునే మూడు మార్గాలు ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.