అతని కన్నుల మీద నుండి బురద కడిగివేయబడినప్పుడు...

యోహాను 9వ అధ్యాయంలో ఉన్న స్వస్థత కార్యం అనేక విధాలలో ప్రత్యేకమైనది మాత్రమే కాదు మర్మముతో కూడినది కూడా!


శిష్యుల విచిత్రమైన ప్రశ్నలకు జవాబులు చెప్పిన తరువాత, యేసుక్రీస్తు చేసిన పని ఒక గుడ్డివాడిని స్వస్థపరచడం :


ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. (యోహాను 9:6,7)


"శుద్దుడవు కమ్ము" అని సులభంగా చెప్పే బదులు ఎందుకని యేసు ఈ అసాధారణ పద్దతి ఉపయోగించారు?


కొంతమంది బైబిల్ పండితులు నేల మీద ఉమ్మి వేసి బురద చేయడం అనేది సబ్బాతు రోజున చేయడం ఒక "పని" కిందకి వస్తుంది, ఆ రోజు పని చేయడం నిషేధం గనుక యేసు అందుకే అలా చేశారు అని అంటారు. అంటే మనుషులు తయారుచేసిన సబ్బాతుకు సంబంధించిన ఆజ్ఞలు చాలా అధికమైనవి, అర్ధంలేనివి అని చెప్పడానికి (మార్కు 7:8)


ఇంకొంతమంది ఏమి నమ్ముతారంటే స్వస్థత అనేది ఏ పద్దతిలో అయినా జరగొచ్చు అని యేసు చూపిస్తున్నారు, ఒకవేళ మన స్వస్థత మందులు డాక్టర్ల వల్ల జరిగినా ఆయనే స్వస్థపరుచువాడు అని మనం అర్ధం చేసుకోవాలని అయన ఉద్దేశం అని.


స్వస్థత అవసరంలో ఉన్న ఆ వ్యక్తిని అర్ధం చేసుకోని ఈ అసాధారణమైన పద్దతిని క్రీస్తు ఉపయోగించారని నేను నమ్ముతున్నాను. బహుశా తన స్వస్థత కోసం తన కూడా పాల్గొవడం అవసరమేమో. తనను ఆ కోనేటి దగ్గరకు నడిపించే సమయంలో ఆ వ్యక్తి మనసులో ఎవరికీ చెప్పుకోలేని దేవునికి మాత్రమే తెలిసిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు బహుశా ఉండి ఉండవచ్చు. తన చేత్తో తానే బురదతో ఉన్న కళ్ళను కడుక్కోని, తన చుట్టు ఉన్న పరిసరాలను జీవితంలో మొట్టమొదటిసారి చూడటం బహుశా అత్యంత ప్రాముఖ్యమేమో. ఎందుకంటే మన దేవునికి కేవలం మనలను స్వస్థపరచడం మాత్రమే కాదు, మనలను రక్షించడం కూడా ప్రాముఖ్యం.


దేవునికి మనం వ్యక్తిగతంగా తెలుసు, కాబట్టి మనతో వ్యక్తిగతంగానే వ్యవహరిస్తారు. ఆయన విధానాలు మనకు అన్నిసార్లు అర్ధం కాకపోవచ్చు, కాని ఆయన జ్ఞానాన్ని, ప్రేమను, ఉద్దేశాలను మనం పూర్తిగా నమ్మొచ్చు (1 కొరింధీ 13:12).


When the Mud Fell from His Eyes


యోహాను 9వ అధ్యాయంలో ఉన్న స్వస్థత కార్యం అనేక విధాలలో ప్రత్యేకమైనది మాత్రమే కాదు మర్మముతో కూడినది కూడా!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.