మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు, లోకం మనతో ఏం చెబుతుందంటే:
1. తిను, త్రాగు, సుఖించు.
కాని పౌలు ఏమంటాడంటే ఇది జీవితానికి ఏ నిరీక్షణ లేని, ఏ గురి లేని వారి నినాదం అని (1 కొరింధీ 15:32).
2. నీ సమస్యలకు ఇతరులను నిందించు.
కాని నువ్వు ఒక బాధితుడి మనస్తత్వంతో జీవించడం నిరాకరిస్తే, దేవుడు నువ్వు దుర్వినియోగించబడినది కూడా మేలుకై వాడుకోగలరని
యోసేపు నిరూపించాడు (ఆదికాండము 50:20).
3. నీకోసమే నువ్వు జీవించు.
కాని ఎవరైతే ఇది చేస్తారో వారే నిజంగా కోల్పోతున్న వారు (మత్తయి 16:25).
మరి దేవునిలో నిన్ను నువ్వు ఎలా ప్రోత్సాహించుకోగలవు?
మనం ఒకటి జ్ఞాపకం తెచ్చుకోవాలి, అదేమిటంటే ప్రతీ ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. మనం వాటికి మినహాయింపు అనుకుంటే మనకంటే వెర్రివారు ఇంకెవరూ ఉండరు. కాని మన పోరాటాలలో మనం ఒంటరి వారం కాము, అంతిమ విజయం మనదే అనేది మనం తెలుసుకోవాలి.
• లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను - యేసు (యోహాను 16:33)
నేను చాలా పెద్ద పోరాటాల్లో ఉన్నప్పుడు, నన్ను నేను దేవునిలో ప్రోత్సాహించుకోవడానికి నిర్ణయించుకుంటాను. అందులో ఒకటి, దేవుని వాగ్దానాన్ని కంఠస్థం చేయడం. నాతో కలిసి మీరు కూడా ఈ క్రింది వచనాన్ని కంఠస్థం చేస్తారా?
• నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. (హెబ్రీయులకు 13:5)
• నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడువను, ఎన్నడూ వదలిపెట్టను (వాడుక భాషలో)
Encourage Yourself in the Lord
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.