అవసరమైన శ్రమలు

చరిత్రలోనే అత్యంత భయంకరమైన "అవసరమైన శ్రమ" గురించి నీకు తెలుసా? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


"అవసరమైన శ్రమ" అని మనం దేనిని పిలుస్తామో తెలుసా?


ఏదైనా చెడు జరగడం వలన మంచిది సాధ్యమాతుందో దానిని.


ఎలాగంటే, తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణ చేస్తేనే వారు మంచిని నేర్చుకుంటారు. సైనికులు బాధలను సహించడం, కఠోరమైన శిక్షణకు గురికావడం వలనే వారు సంసిద్దులవ్వగలరు. కాన్సర్ ను శరీరంలో నుండి తొలగించాలంటే ఆ రోగులు కీమొథెరపీ తీసుకుంటేనే అది సాధ్యం.


అవసరమైన శ్రమ లేక చెడు పడిపోయిన మానవుని ప్రపంచంలో ఒక భాగమే.


దేవుని పరిపూర్ణమైన ప్రపంచంలోకి మనమే పాపం ద్వారా శ్రమను / చెడును తెచ్చాము. కాని అది తెచ్చిన మనలను నాశనం చేయడం బదులు, ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో మన సమస్యలనే "అవసరమైన శ్రమల" ద్వారా దేవుడు తనను యదార్ధంగా ప్రేమించే వారిని గుర్తుంచి రక్షించాలనేది దేవుని నిర్ణయం.


చెడును శ్రమను అనుమతించిన దేవుణ్ణి కొంతమంది నమ్ముకోవడానికి ఇష్టపడరు.. అంటే వారు క్షమాపణకు, విమోచనకు తమ్మును తామే దూరం చేసుకుంటున్నారు.


కాని ఎవరైతే రక్షింపబడతారో వారు ఎంతో ముఖ్యమైన, ఎంతో భయంకరమైన, ఎంతో అద్భుతమైన, మానవ చరిత్రలోనే మరిచిపోలేని అవసరమైన భయంకరమైన శ్రమ విషయంలో ఎంతో కృతజ్ఞత గలిగి ఉంటారు.. అదేమిటంటే, మన రక్షకుడైన యేసు ప్రభువు ఘోర మరణం.


అవసరమైన ఈ గొప్ప శ్రమ ఆయన పొందడం వలనే మనం ఇంత ఆనందం పొందటం సాధ్యమైంది.


ఈ క్రింది వచనాలు చదివి ప్రోత్సాహం పొందు:

• విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. (1 కొరింథీయులకు 6:20)

• ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. (2 కొరింథీయులకు 5:21)

• మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. (1 పేతురు 2:24)

• మన యతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. (యెషయా 53:5)

• అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. (యెషయా 53:10)


Necessary Evils


చరిత్రలోనే అత్యంత భయంకరమైన "అవసరమైన శ్రమ" గురించి నీకు తెలుసా? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.