నీ మనస్సుని అలా సంచరించడానికి వదిలేస్తే, అది ఎక్కడికి వెళ్తుంది?
ఎన్నిసార్లు నా మనస్సు అదుపు తప్పి తిన్నగా మురికి ఆలోచనలలోకి దూరికేళ్ళిందో చెప్పలేను. అలాగని అవి అస్లీలమైనవి కావుగాని, చేదైన జ్ఞాపకాలు, చింతించడం, స్వ-జాలి వంటివి. మరి ముఖ్యంగా నేను ఏదైనా కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా వస్తుంటాయి.
• నీకు తెలుసా, మనం నిమిషానికి 120 మాటలు మాట్లాడితే, నిమిషానికి 1300 మాటలంత తీవ్రతతో ఆలోచిస్తామంట?
• కాబట్టి మాటల కంటే 10 సార్లు ఎక్కువగా ఈ నిరుత్సాహపు ఆలోచనలు మనలను నిరాశ అనే గుంటలో పాతి పెడతాయి.
అందుకేనేమో దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది "మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి.. (2 కొరింథీయులకు 10:5)
నీ జీవితంలో ఏదైనా విషయంలో పోరాటంలో ఉన్నావా? బహుశా నీ ఆలోచనల ప్రమేయమే దానికి ప్రధాన కారణమేమో. ఈరోజే కొద్ది సమయం తీసుకోని నీ ఆలోచనలను చెరపట్టి క్రీస్తుకు లోపరచడానికి ఆయన సహాయం అడుగు!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.