అపవాది యొక్క గొప్ప భయం

మన జీవితాన్ని నాశనం చేసే అపవాది యొక్క కుట్రల నుండి తప్పించుకోవాలని ఉందా? వాటి నుంచి రక్షణ ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!


అపవాది యొక్క గొప్ప భయం ఏమిటో నీకు తెలుసా? బైబిల్ ని నువ్వు తరుచు, జాగ్రత్తగా, జ్ఞానంతో చదవడమే. (1)


ఎందుకని ఇది అతనిలో అంత భయం పుట్టిస్తుంది?


ఎందుకంటే అప్పుడు అబద్ద బోధలు, అసత్యాలకు మనం లోనుకాము కనుక. అప్పుడు రాజీపడిపోయిన, లోతులేని విశ్వాసం ఉన్న ఎదగని పసిపిల్లల్లా మనం ఉండం గనుక.


ప్రతీ ఒక్క యదార్ధమైన విశ్వాసుల్లో తప్పక ఉండే దేవుని ఆత్మ మనలో ఉంటే, వాక్యం చదివి కూడా బలహీనంగా, పాపంతో, బుద్ధిహీనులంగా ఉండలేం.


ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీయులకు 4:12)


దేవుని వాక్యం మనలను శోధించి, మన పాపముల విషయంలో పశ్చాతాపానికి నడిపిస్తుంది. అంతమాత్రమే కాదు అది క్రైస్తవులమయిన మన జీవితంలో ఉన్న ప్రతీ అంశానికి ప్రయోజనకరంగా ఉండటానికి సరిగ్గా సరిపోయేది. ప్రతీ అంశానికి!


దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది. (2 తిమోతికి 3:16-17)


ప్రతీ రోజూ దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుంటూ, ఎక్కువగా సేవిస్తూ ఉండాలంటే, దేవుని వాక్యానికి జీవితకాలమంతా అంకితభావం కలిగిన విద్యార్థుల వలే ఉండాలి. అలా ఉండాలి అంటే సందర్భానికి సంబంధం లేకుండా వాక్యానికి మనకిష్టమైన అర్ధాన్ని ఇమడ్చడం లేదా సగం సత్యాలను చెప్పే ప్రయత్నాలు చేయడం వంటివి చేయకూడదు!


🌟 వాక్యాన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి :

దేవుని యెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. (2 తిమోతికి 2:15)


నేను దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమిస్తాను!

💙💙💙💙💙💙💙


(1) అపవాది యొక్క గొప్ప భయం నాకైతే తెలీదు అనే విషయం మీకు సులభంగానే అర్ధమైంది అనుకుంటాను, అయినప్పటికీ నేను చెప్పింది తప్పకుండ అపవాదిని భయానికి గురిచేసేదే.


Satan's Greatest Fear





మన జీవితాన్ని నాశనం చేసే అపవాది యొక్క కుట్రల నుండి తప్పించుకోవాలని ఉందా? వాటి నుంచి రక్షణ ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.