నాకు తోట పని చేయడమంటే చాలా ఇష్టం.
కలుపు మొక్కలు చాలా వరకు నాకు చిరాకు పెడతాయి గనుక అవి నా కంటికి కనబడగానే వాటిని పీకేస్తాను.
కాని కొన్నిసార్లు కొన్ని కలుపు మొక్కలు చాలా 'అందంగా' ఉంటాయి కాబట్టి వాటిని పెరగనిస్తాను. అవి పసుపు రంగులో చూడటానికి అందంగా ఉన్నాయని నా వంటగది వాస్ లో పెట్టి అమర్చుకుంటాను.
కాని ఒక రోజు అదే కలుపు మొక్క గురించి అది ఎంత ప్రమాదకరమో అనే దానిపై ఒక వ్యసాన్ని చదివాను. అందులో ఒక్క విత్తనం ఎలా కొన్ని వందల కలుపు మొక్కలను ఉత్పత్తి చేసి, కొద్ది కాలంలోనే తోటనంతటిని ఆక్రమించి, మంచి మొక్కలను కుడా ఎలా పాడుచేయగలవో అందులో వివరించారు.
నేనది చదివిన వెంటనే, నా తోటలోకి పరుగెత్తుకెళ్ళి, ఏవైతే నాకు నచ్చి పెరగనిచ్చానో ఆ 'అందమైన కలుపు మొక్కలను' వేర్లతో సహా పీకేసాను. కొన్నయితే చాలా పెద్దగా పెరిగిపోయాయి గనుక ఎంత ప్రయత్నించినా వేర్లతో సహా పీకలేకపోయాను. ఆ క్షణంలో నాకొక శక్తివంతమైన ఆత్మీయ సత్యం గుర్తుకొచ్చింది.
ఎంత తరుచుగా మనం 'ఆత్మీయ కలుపు మొక్కలను' మన జీవితాల్లో పెరగనిస్తామో కదా.. అవి చెడు అలవాట్లు, వైఖరులుగా మొదలై, దేవుడు మనలో ఆశించే మంచి ఫలాలు ఫలించకుండా, ఈ కలుపు మొక్కలే పూర్తిగా ఆక్రమించేంతగా?
మన దృష్టిని మరల్చే ఎన్నో వాటిని, ఎన్నో పాపాలను మనం పోషిస్తుంటాం... అవి ఎంతో నిశబ్దంగా మన సమయాన్ని, బలాన్ని, గురిని దొంగిలించేసి, అసలు నిజంగా ఏవి విలువైనవో వాటిని వదిలిపెట్టేలా చేస్తాయి.
ఈ క్షణంలో, మన జీవితాల్లో ఉన్న ఏవైతే పర్వాలేదులే అనుకోనే లేదంటే ఇష్టంగా అనిపించే 'అందమైన కలుపు మొక్కలను' గుర్తించడానికి మరియు తీసివేయడానికి కొంత సమయం తీసుకుందామా. లేదంటే అవి ఇంకా ఎక్కువగా మన జీవితాన్ని ఆక్రమించి, మార్కు 4:19 లో వివరించినట్టు అవి ముళ్లులా లోతుగా వేరుపారే ప్రమాదం ఉంది.
కాని దేవుని సహాయంతో, వాటిని మన తోటలో నుండి తీసిపారవేయొచ్చు. ఎప్పుడైతే అది చేస్తామో, మన ఆత్మీయ తోట ఫలభరితంగా మారుతుంది.
"...మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి,..." (హెబ్రీయులకు 12:2)
Pretty Weeds We Let Grow in Our Lives


 
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.