నువ్వు క్రైస్తవుడవైతే, ఈ అద్భుతమైన సత్యాలను నీకు నువ్వు చెప్పుకుంటూ ప్రతీ రోజును మొదలుపెట్టు.
1. నేను దేవుని బిడ్డను.
• తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. (యోహాను 1:12)
• మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. (1 యోహాను 3:1)
2. నేను మరణాన్ని పొందడానికి అర్హుడనైనా, యేసు నా పాపాలను క్షమించి, నిత్యజీవాన్ని వాగ్దానంగా ఇచ్చాడు.
• ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. (రోమీయులకు 6:23)
3. ఈరోజు ఏమైనా, నేను మాత్రం ఒంటరిని కాను.
• మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. (రోమీయులకు 8:38, 39)
4. దేవుడు నాతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు మాత్రమే కాదు, ఆయన నా సహాయకుడు కూడా.
• ..నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. (హెబ్రీయులకు 13:5,6)
5. దేవుడు నాకు ఆయన శక్తిని ఇస్తారు గనుక, నేను ఆయన ఆజ్ఞలకు లోబడగలను.
• నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. (ఫిలిప్పీయులకు 4:13)
6. ఈరోజు నేను అపవాదిని ఎదిరిస్తాను, వాడు నా యొద్ద నుండి పారిపోతాడు.
• కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. (యాకోబు 4:7)
7. ఈరోజు దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, అది నెరవేర్చాలని నేను ఆశపడుతున్నాను.
• మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసు నందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. (ఎఫెసీయులకు 2:10)
8. నేను దేవునితో నడుస్తూ ఉంటే, నా జీవితంలో జరిగిన చెడు విషయాలను కూడా ఆయన ఈరోజు, ప్రతీ రోజూ నా మేలుకై వాడతారు!
• దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. (రోమీయులకు 8:28).
8 Statements Christians Should Make Each Day


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.