మనకు

ఒక్క నిమిషంలో చదవగలిగిన ఈరోజు వాక్య ధ్యానం యెషయా 9:6 లో ఉన్న ప్రవచనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది!


యెషయా 9:6 పాత నిబంధనలో ఉన్న ఈ ప్రవచనం, అన్ని ప్రవచనాల కంటే నాకు ఎక్కువ ఇష్టం.


ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. (యెషయా 9:6)


క్రీస్తు ఒక మానవుడు మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ అనేది ఈ వివరణలో మనకు స్పష్టంగా అర్ధమవుతుంది. ఇలాంటి వివరణలే మనం కీర్తన 2 మరియు 110 లో కూడా చూస్తాం. మార్కు 12:36 లో యేసు ప్రభువు తాను కేవలం మానవుడు మాత్రమే కాదు అనే విషయాన్ని కీర్తన 110 నుండి తీసుకోని  మాట్లాడటం మనం చూస్తాం.


🌟మనకు శిశువు పుట్టెను
యెషయా 7:14 ఈ ప్రవచనానికి అదనపు వివరణ ఇవ్వడం మనం చూస్తాం: "కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును"


సువార్తల్లో కూడా దీనికి సంబంధించి ఇంకా ఎన్నో అద్భుతమైన వివరణలు చూస్తాం. వీటిని ప్రతీ క్రిస్మస్కి చదవాలి : లూకా 2:1-20.


🌟ఆయన భుజముమీద రాజ్యభారముండును.
దీని అర్ధం ఆయన ఈ లోక నాయకుడు అని కాదు. అసలు ఆయన చరిత్రనే నియంత్రించగలిగే అధికారం గలవాడు అని.


🌟ఆలోచనకర్త
దేవుని జ్ఞానం సంపూర్ణమైనది.


🌟బలవంతుడైన దేవుడు
ఆయన శక్తికి సాటి అయినది ఏదీ లేదు.


🌟నిత్యుడగు తండ్రి
క్రీస్తును గూర్చి ఈ ప్రవచనాన్ని చూస్తే, ఇందులో త్రియేక దేవుని వర్ణన ఉంది. ఎందుకంటే త్రియేక దేవుడు ఎల్లప్పుడూ ఆయన ప్రణాళికలకు అనుగుణంగా సంపూర్ణమైన ఏకత్వంలో ఉంటారు (ఉదా: మత్తయి 3:16,17).


🌟సమాధానకర్తయగు అధిపతి
శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. (యోహాను 14:27)


🌟మన రక్షకునిలో ఆనందిద్దాం!🌟


 Unto Us


ఒక్క నిమిషంలో చదవగలిగిన ఈరోజు వాక్య ధ్యానం యెషయా 9:6 లో ఉన్న ప్రవచనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.