క్రిస్మస్ సమయంలో (అన్ని సమయాల్లో కూడా) మనం నమ్మవలసిన ఆరు విషయాలు

క్రిస్మస్ సమయంలో గుర్తుపెట్టుకోడానికి, పఠించడానికి, నమ్మడానికి - ఆరు విషయాలు - నేరుగా లేఖనాల నుండి!


యేసు ప్రభువు పుట్టిన రోజును మనం పండుగ చేసుకుంటున్న సమయంలో ఈ సత్యాలను ఆలోచిద్దాం.


1. యేసును గురించిన అద్భుతాన్ని నమ్ముదాం.

• ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. (యెషయా 9:6)


2. యేసు వచ్చిన ఉద్దేశాన్ని నమ్ముదాం.

• దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3:16)


3. యేసు నీ జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగిన్నారని నమ్ము.

• మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. (ఎఫెసీయులకు 2:10)


4. యేసులో ఆదరణ ఉందని నమ్ముదాం.

• గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు. (కీర్తనలు 147:3)


5. యేసులో ఆనందం ఉందని నమ్ముదాం.

• యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు. (నెహెమ్యా 8:10)


6. యేసును అత్యాశక్తితో వెదకడాన్ని నమ్ముదాం!

• దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. (హెబ్రీయులకు 11:6)


6 Things to Believe in at Christmas (and Always!)


క్రిస్మస్ సమయంలో గుర్తుపెట్టుకోడానికి, పఠించడానికి, నమ్మడానికి - ఆరు విషయాలు - నేరుగా లేఖనాల నుండి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.