పింటరెస్ట్ లో నేను ఈ కొటేషన్ చదివాను :
"నీ బిడ్డ నీ సలహా కంటే, నిన్ను అనుకరిస్తుంది అని".
మన జీవితం మన మాటల కంటే గట్టిగా మాట్లాడుతుంది అనేది వాస్తవమే గాని, ఈ కొటేషన్ యొక్క సారాంశం తప్పు.
కొన్నిసార్లు మన పిల్లలు మన సలహానే కాదు, మన జీవితాన్ని కూడా అనుకరించరు.
ఒకవేళ మన జీవితాన్ని వారు అనుకరిస్తారు అని గనుక మనం నమ్మితే, మనం మన పేరెంటింగ్ పై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నామని అర్ధం!
కొన్నిసార్లు ఈ సమస్య, సామెతలు 22:6 ని తప్పుగా అర్ధం చేసుకోవడం వలన వస్తుంది "బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు".
ఈ సామెతను రెండు విధాలుగా మనుషులు తప్పుగా అర్ధం చేసుకుంటారు :
1. దైవికమైన తల్లిదండ్రులకు దైవికమైన బిడ్డలే ఉంటారు అని ఒక వాగ్దానంగా తీసుకుంటారు.
2. దైవికంగా లేని ఎదిగిన పిల్లల్ని చూసి వారి తల్లిదండ్రులను నిందిస్తారు.
అసలు సామెతల పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అది జ్ఞానాన్ని అందించే పుస్తకం కాని అది వాగ్దానాల పుస్తకం కాదు (సామెతలు 1:1-6)
అలా అని సామెతలు దేవుని వాక్యం కాదు అని కాదు దీనర్ధం. అది పూర్తిగా దేవుని వాక్యమే. ఎలాగైతే లేఖనాల్లో పద్యం, కధనం, రూపకాలంకారం, పోలిక ఉన్నాయో, సామెతలు జ్ఞానాన్ని అందించే పుస్తకం, కాని వాగ్దానాల పుస్తకం కాదు. బైబిల్. ఆర్గ వారు ఈ విధంగా దీనిని వర్ణించారు : "జీవితం గురించి ఈ చిన్న, అర్ధవంతమైన పరిశీలనలు అందరికి సాధారణంగా వర్తించేవి, కనుక వీటిని దేవుని వాగ్దానాలుగా లేక ఖచ్చితమైనవిగా తీసుకోకూడదు"
ఒకవేళ సామెతలే గనుక వాగ్దానాలైతే, దైవికమైన వారంతా ధనవంతులుగా ఉండి, దీర్ఘకాలం పూర్తి ఆరోగ్యంతో జీవించాలి (సామెతలు 10:22,27). ఇది గనుక నువ్వు నమ్మితే, ఇతర చోట్ల ఉన్న లేఖన భాగాలు పెద్దమొత్తం తొలగించాలి, లేక సందర్భాన్ని పక్కన పెట్టి వాక్యాన్ని చదవాలి.
ఈ సత్యాన్ని కొన్ని సంవత్సరాలు తప్పుగా నేను అర్ధం చేసుకున్నాను, దాని వల్ల ఈ మూడిట్లో ఒకటి నేనయ్యాను :
• నా పిల్లలు మంచి నిర్ణయాలు తీసుకుంటే, నేను స్వనీతిపరురాలినయ్యాను.
• నా పిల్లలు ప్రశ్నించదగ్గ నిర్ణయాలు తీసుకుంటే, నేను గందరగోళానికి గురైయ్యాను.
• నా పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, నేను అపరాధభావానికి గురైయ్యాను.
దేవునికి పిల్లలే గాని, మనవలు లేరని నేను నేర్చుకోవాల్సివచ్చింది.
15 ఏళ్ళ క్రితం, నాలాగే హోమ్ స్కూలింగ్ చేసే నా ఇతర స్నేహితులు కూడా నేను ఏదైతే నమ్మెనో వారూ అదే నమ్మేరు - అదేమిటంటే, మా దగ్గరే రహస్యం ఉంది, పిల్లల పెంపకంలో విజయానికి అని. కాని తరువాత సంవత్సరాలలో నేను చూసింది ఏమిటంటే, చాలా మంది దైవికమైన తల్లిదండ్రులు ఎదిగిన వారి పిల్లల నిర్ణయాలు చూసి ఎంతో నిరాశ చెందారు. మన పిల్లలు గనుక మంచివారిగా తయారైతే, మనం తీర్పు తీర్చే వారిగా, స్వనీతిపరులుగా తయారవుతాం. ఒకవేళ వారు మంచివారిగా తయారు కాకపోతే, మనల్ని మనం నిందించుకుంటూ, దేవుడు మనల్ని నిరాశపరిచాడు అనే భావనలో ఉంటాం.
స్వనీతిపరులుగా ఉండటం ఎక్కువ హాని కలుగజేస్తుంది, ఎందుకంటే అలాంటి వారు బాధపడేవారికి 'యోబు స్నేహితులుగా' ఉంటారు.
మన సంస్కృతి, ఎదిగిన పిల్లల్ని వారి తల్లిదండ్రులను వారి వైఫల్యాలను బట్టి నిందించమని ప్రోత్సాహపరుస్తుంది, తరుచూ తల్లిదండ్రులు ఆ నిందల్ని అంగీకిరస్తారు. కాని అది వాక్యానుసారం కాదు. బైబిల్ ఏమి చెబుతుందంటే, మనం మన పిల్లల్ని ఎలా పెంచాం అనే దానికి మనం దేవునికి బాధ్యులం, కాని మన ఎదిగిన పిల్లల యొక్క నిర్ణయాలకు మాత్రం మనం బాధ్యులం కాదు.
"పాపము చేయువాడే మరణము నొందును; తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును". (యెహెజ్కేలు 18:20)
మన పిల్లలు మన ఇంట్లో ఉన్నంతవరకు, మనం వారికి భోదించాలి, సరైన ప్రవర్తన నేర్పించాలి.. కాని వారు ఎప్పుడైతే ఒక వయస్సుకు వస్తారో, వారే వారి సొంత నిర్ణయాలు తీసుకుంటారు.
ప్రతీ విశ్వాసి ఆరోగ్యంగా, ధనవంతులుగా ఉండాలి అనే నువ్వు గనుక నమ్మితే (దీని అర్ధం అపొస్తులను, మిషనరీలను వారికి తగిన విశ్వాసం లేదని నువ్వు తీర్పు తీర్చాలి), లేదా సామెతలు 22:6 ఒక వాగ్దానం అని నువ్వు నమ్మడం మానేయాలి.
నీకు వీలైనంతలో నువ్వు ఒక మంచి తల్లిగా లేక తండ్రిగా ఉండు. కాని నీ బిడ్డల నిర్ణయాలకు నువ్వు ఘనత లేక నింద రెండూ తీసుకోకు. దానిబదులు, వారు కనుక పరిశుద్ధతను ఎన్నుకుంటే, దేవుని స్తుతించు, లేదంటే వారి కోసం దేవునికి ప్రార్ధించు!
Giving Parents Too Much Credit or Blame


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.