❤️ హృదయం అనే మాట మొదటిసారి లేఖనాలలో వ్రాయబడిన సందర్భం చాలా ప్రాముఖ్యమైనది.
నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి ❤️ హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన ❤️ హృదయములో నొచ్చుకొనెను. (ఆదికాండము 6:5,6)
గొప్ప విషయం ఏమిటంటే, దేవుడు మనలను వదిలిపెట్టలేదు. ఎవరైతే ఆయన ప్రేమకు స్పందిస్తారో, వారికి యీ కానుకను ఇస్తానని వాగ్దానం చేశాడు :
నూతన ❤️ హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. (యెహెజ్కేలు 36:26)
అన్నింటికంటే ఉన్నతమైనదేమిటంటే, మనమెప్పుడైతే క్రీస్తు వద్దకు వస్తామో, మన ❤️ హృదయాలే ఆయన ప్రేమలేఖలైపోతాయి :
రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని ❤️ హృదయములు అను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయైయున్నారని మీరు తేటపరచబడుచున్నారు. (2 కొరింథీయులకు 3:3)
❤️ ప్రియమైన ప్రభువా, మా హృదయాలపై నీ ప్రేమను వ్రాసినందుకు కృతఙ్ఞతలు!
❤️ What God Does with Stone Hearts - Ezekiel 36:26


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.