కీర్తనలు 143 - 6 విధాలుగా మన శత్రువులను ఓడించడం

143 వ కీర్తన, ఆరు విధాలుగా మన శత్రువులను ఎలా ఓడించగలమో వివరిస్తుంది, ఆ శత్రువులు మనమే తయారు చేసుకున్నవారైనా. వివరణ ఈరోజు వాక్యధ్యానంలో!


కొన్నిసార్లు మన శత్రువులదే పై చేయిగా ఉన్నట్టు కొన్ని సందర్భాలలో మనం చూస్తాం.


ఇంకొన్నిసార్లు, మనకు మనమే ఘోరమైన శత్రువుగా మారి,  మనలను నిరాశలోకి నెట్టేసేలాగా మన ఆలోచనలతో ప్రభావితం అవుతాము.


మనం ఏ రకమైన శత్రువును ఎదుర్కొంటున్నా, కీర్తనలు 143 మనకు మంచి సలహాన్నిస్తుంది :


1. కీర్తనాకారుడు దేవునికి మొఱ్ఱపెట్టాడు (1-6).

2. దేవుని సహాయం లేకుండా తాను సాధించలేనని ఒప్పుకున్నాడు (7).

3. పొద్దున్నే సహాయం కోసం దేవుణ్ణి కలుసుకున్నాడు (8).

4. దేవుడే తనను కాపాడతాడని నమ్మి, ఆయనలో దాగుకున్నాడు (9).

5. ఆయన ఆత్మ నడిపింపును, జ్ఞానాన్ని అడిగాడు (10).

6. దేవునిలో నమ్మకాన్ని, దేవునికి లోబడటాన్ని ధృవీకరించాడు (8,12).


ఎప్పుడైనా మనం ఇబ్బందిపడినా, నిరుత్సాహపడినా లేక దాడికి గురైనా, ఈ ముఖ్యమైన అడుగుల్లోనే మనం నడవాలి. ఇతరుల నుండి దైవికమైన సలహాలు తీసుకోవడం మంచిదే గాని, మొట్టమొదట దేవునికి మన అవసరతను విన్నవించుకొని ఆయన సలహాను తీసుకోవాలి.


మనం లేవగానే, భయం లేక చేదు ఆలోచనలు మనలను ఆక్రమించకముందే, దేవుణ్ణి వెదకి, ఆయన ఇచ్చే జ్ఞానంలో, ఆదరణలో దాక్కోవాలి.


ఆయన నడిపింపును వెదుకుతూ, ఆయనపై మన నమ్మకాన్ని ఒప్పుకోవాలి.


6 Ways to Fight Our Enemies - Psalm 143


143 వ కీర్తన, ఆరు విధాలుగా మన శత్రువులను ఎలా ఓడించగలమో వివరిస్తుంది, ఆ శత్రువులు మనమే తయారు చేసుకున్నవారైనా. వివరణ ఈరోజు వాక్యధ్యానంలో!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.