చిన్న పుస్తకమైన హగ్గయి గ్రంధంలో ఉన్న గొప్ప జ్ఞానం

రెండు అధ్యాయాలు ఉన్న హగ్గయి గ్రంధం ఈరోజు మనకు గొప్ప జ్ఞానాన్ని అందిస్తుంది. ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


నువ్వు ఎప్పుడైనా చిన్న పుస్తకమైన హగ్గయి గ్రంధాన్ని చదివావా?


జీవితానికి అవసరమైన ముఖ్యమైన సూత్రం అందులో ఉంది.


దేవుడు తన ప్రజలను తమ దేశానికి తిరిగి సమకూర్చిన తరువాత, ఆ ప్రజలు వారి కోసం 'సరంబీ' వేసిన గృహాలను కట్టుకున్నారు గాని, దేవుని ఆరాధించడానికి మందిరాన్ని కట్టలేదు.


వారు గృహాలను కట్టుకోవడంలో దేవునికి అభ్యంతరమేమీ లేదు గాని, వారు కేవలం వారి పైనే దృష్టి నిలపడం దేవుడు వారి నుండి ఆశించలేదు.


వారు పైనే దృష్టి నిలపడం వలన ఎన్నో ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారు (1:6,10,11), దేవుని సంతోషాన్ని, ఘనతను తృణీకరించినవారయ్యారు (1:7).


'మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి' అని రెండు అధ్యాయాలు ఉన్న ఈ పుస్తకంలో నాలుగుసార్లు దేవుడు హెచ్చరించారు (1:5,7, 2:15,18).


హగ్గయి గ్రంధం, చరిత్రలో ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన ప్రజకు వ్రాయబడినా, ఈరోజు కూడా దీని ద్వారా, మనతో ప్రాధాన్యతలు గురించి మాట్లాడుతుంది. దేవుణ్ణి తృణీకరించి, మనం కూడా మనపై ఎక్కువ దృష్టి నిలిపి, ఆయన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నామా?


ఇదే సూత్రం, కొత్త నిబంధనలో ఉన్న మత్తయి 6:33 మనకు గుర్తుచేస్తుంది : కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.


మన ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచించుకుందాం!


Great Wisdom in the Small Book of Haggai


రెండు అధ్యాయాలు ఉన్న హగ్గయి గ్రంధం ఈరోజు మనకు గొప్ప జ్ఞానాన్ని అందిస్తుంది. ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.