ప్రతిరోజు జీవితాన్ని నడిపించుకోవడం

 

1 థెస్సలొనీకయులకు లో ఉన్న ఈ మూడు వచనాలు ప్రతీరోజు జీవితానికి కావలసిన శాంతిని సంతోషాన్ని పొందే నిధి వంటివి. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!

కొన్నిసార్లు దేవుడు గొప్ప సత్యాలను, క్లుప్తంగా పంచుకుంటారు. అటువంటిదే 1 థెస్సలొనీకయులకు 5:16-18:


"ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము."


• ఎప్పుడు సంతోషించాలి?

ఎల్లపుడు!


• ఎప్పుడు ప్రార్ధించాలి?

ఎడతెగక!


• ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి?

ప్రతి విషయమునందును!


• ఎందుకు?

ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.


మన జీవితాలు సులభమైనవి కావని, సంతోషించేవిగా ఉండవని దేవునికి తెలుసు. కాని బాధను, నొప్పిని, తిరస్కారాన్ని, విరిగిపోవడాన్ని అధిగమించేలాగా దేవుడు మనలను తయారుచేశారు. అదెలాగంటే, సంతోషంగా ఉండటం ద్వారా, ప్రార్ధన ద్వారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా.


చెడు సందర్భాల కోసం సంతోషంగా, కృతజ్ఞతతో ఉండాలనా దీనర్ధం? కాదు.


చెడు సందర్భాల్లో సంతోషంగా, కృతజ్ఞతతో ఉండాలని.


ప్రార్ధన మనలను దేవునితో సంబంధంలో ఉంచి, దేవుడు చెడును కూడా మంచిగా మార్చగలరనే సత్యాన్ని గుర్తుచేస్తుంది (రోమా 8:28).


యేసు క్రీస్తులో మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. (రోమీయులకు 8:18).


కాబట్టి దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము.. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. (2 కొరింథీయులకు 4:17,18)


--------------


* అంతంలో జరిగిన చెడు విషయాలను బట్టి కూడా ఆనందించగలం, ఎందుకంటే అవి మనలో మంచి పనిని జరిగిస్తాయి. కొన్నిసార్లు చెడు విషయాలు సాధించే మంచి, మంచి విషయాలు ఎప్పటికీ సాధించలేవు.




1 థెస్సలొనీకయులకు లో ఉన్న ఈ మూడు వచనాలు ప్రతీరోజు జీవితానికి కావలసిన శాంతిని సంతోషాన్ని పొందే నిధి వంటివి. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.