జాతి వివక్షను రూతు జయించింది

రూతు నయోమితో యూదాకు వచ్చినప్పుడు జాతి వివక్షను ఎదుర్కొంది. కాని దానిని ఎలా జయించాలో ఆమెకు తెలుసు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


రూతు కథ (రూతు 1-4) కొన్ని అద్భుతమైన పాఠాలను అందిస్తుంది. ఎన్నో ప్రతికూలతలలో కూడా ఆమె విశ్వాసంలో స్థిరంగా నిలబడింది.


జాతి వివక్షను కూడా ఆమె జయించింది.


మోయబు, రూతు స్వదేశం, అది విగ్రహారాధన దేశం.. దేవుని ప్రజలకు దీర్ఘకాల శత్రువు. (1)


ఆమె నయోమితో యూదాకు వచ్చినప్పుడు, ఒక శంకించగల గుణం కలిగిన అన్యురాలుగా ఇతరులు ఆమెను చూసి ఉండవచ్చు. (2)


అయినా కూడా రూతు, తనపై ఉన్న అన్యాయపు వివక్ష పై కాకుండా, దేవుని చిత్తం పైనే దృష్టి నిలిపి, తనను తాను నిరూపించుకుంది.


బోయజు ఆమెను కలిసేతప్పటికే, ఆమె విశ్వాసం గురించి, నయోమి పట్ల ఆమె కరుణ గురించి మరియు యూదాకి రావడంలో ఆమె త్యాగం గురించి అతనికి తెలుసు (రూతు 2:11). ఆమె దైవిక గుణాలు ఆ గ్రామంలో అందరూ మాట్లాడుకునే ఒక అంశం. గుణవతిఐన స్త్రీ గా ఆమె అందరికి తెలుసు (రూతు 3:11) నయోమి స్నేహితులు రూతు "ఏడుగురు కుమారులకంటే ఎక్కువ" అని అనుకునే వారు (రూతు 4:14-15). (3)


మనలను విమర్శించే వారిని మనం అన్నిసార్లు మార్చలేకపోవచ్చు, కాని వివక్షపై కాక, దేవుని చిత్తం పై మనం దృష్టి పెడితే మన ఆత్మలు ఆరోగ్యకరంగా ఉంటాయి (కొలస్సీ 3:23).


-----


ఫుట్ నోట్స్ :


(1) లోతుకు ఆయన కూతురులకు మధ్య అక్రమసంబంధం ద్వారా కలిగిన సంతానం వలన కలిగిన వారే మోయాబీయులు (ఆదికాండము 19:30-38).


మొదట నుండి మోయాబీయులు ఇశ్రాయేలేయులను ఇబ్బంది పెట్టే వారు, వారికి నిరంతర శ్రమగా ఉన్నవారు. ఇశ్రాయేలేయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత, ఇశ్రాయేలేయులను వారి ప్రాంతం నుండి వెళ్ళనిచ్చే వారు కాదు, అంతేకాదు వారికి అవసరమైన ఆహరం లేక నీరు అమ్మేవారు కాదు (ద్వితీయోపదేశకాండము 23:3,4)


న్యాయధిపతులున్న సమయంలో మోయాబీయులు  ఇశ్రాయేలేయులను తరుచూ హింసించేవారు (న్యాయధిపతులు 3:12-30;11:17).


(2) అన్ని అన్యమతస్తులను తిరస్కరించమని యూదులు నేర్చుకున్నారు. అంతేకాకుండా అన్యులను పెళ్లిళ్లు చేసుకోవడం , వారితో కలవడం నిషేధించబడింది. కాని విదేశీయులతో యూదులలానే గౌరవంతో వ్యవహరించాలని దేవుడు ఆశించాడు. 


మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులైయుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను. (లేవీయకాండము 19:34)


కాని విచారం ఏమిటంటే, విదేశీయులు ఈ విధంగా అంగీకరించబడరు. కనుక రూతు కూడా వివక్ష, అనుమానం, సంసయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆమె మోయబీయురాలు.


(3) రూతు తాను ఎదుర్కొంటున్న వివక్షను అర్ధం చేసుకున్నా, దానికి తగ్గింపుతోనే స్పందించింది. బోయజు ఆమెతో దయతో వ్యవహరించినప్పుడు కూడా ఆమె -  "అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని అడిగింది (రూతు 2:10). బోయజు దేవుని ఎరిగిన వ్యక్తి, రూతు అన్యదేవుళ్లను విడిచిపెట్టిందని ఆయనకు తెలుసు (రూతు 2:12). లేవీయకాండము 19:34 ప్రకారం ఆమెను ఎంతో గౌరవించాడు.


Ruth Overcame Ethnic Prejudice


రూతు నయోమితో యూదాకు వచ్చినప్పుడు జాతి వివక్షను ఎదుర్కొంది. కాని దానిని ఎలా జయించాలో ఆమెకు తెలుసు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.