మనకు అభిమానులు కాదు, స్నేహితులు అవసరం

నువ్వు వినడానికి ఇష్టం లేని వాటిని చెప్పే స్నేహితులను కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? అటువంటి స్నేహితులను నీ జీవితంలోనికి ఎందుకు ఆహ్వానించాలో ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


"నిజమైన స్నేహితుడు నీ ముందే నిన్ను గాయపరుస్తాడు" - ఆస్కార్ వైల్డ్ 


• మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును. (సామెతలు 27:6)


స్వాభిమానం గురించి లోకం ఇచ్చే ప్రాధాన్యత, మనుషులలో అర్హత లేని మెప్పు కోసం ఆకలిని పుట్టిస్తుంది.


ఈ అర్హత లేని ధ్రువీకరణ అనే ఆహారం మనలను బద్ధకస్తులుగా, గర్విష్ఠులుగా, నిర్మాణాత్మక విమర్శను వ్యతిరేకించే వారిగా మార్చేస్తుంది.


నెమ్మదిగా స్నేహితులకు బదులు, అభిమానులను మన చుట్టూ పోగేసుకోవడం మొదలుపెడతాం.


విచారం ఏమిటంటే ఎప్పుడైతే సలహాలను తీసుకోవడానికి ఇష్టపడమో, ఎప్పటికి జ్ఞానవంతులంగా, దేవునిలో బలవంతులంగా ఎదగలేం. కేవలం మనల్ని మనం మోసం చేసుకుంటాం.


నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. (సామెతలు 19:20)


మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును. (సామెతలు 12:15)


నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. (సామెతలు 1:8)


నిజమైన స్నేహితులు, మంచి తల్లిదండ్రులు, దైవికమైన పాస్టర్లు మనలను సవాలు చేస్తారు, సరి చేస్తారు.


మనకు నిజమైన స్నేహితులు అవసరం, కాని అభిమానులు కాదు.


We Need Friends, Not Fans


నువ్వు వినడానికి ఇష్టం లేని వాటిని చెప్పే స్నేహితులను కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? అటువంటి స్నేహితులను నీ జీవితంలోనికి ఎందుకు ఆహ్వానించాలో ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.