మత్తయి 21:23-27 లో, పరిసయ్యులు యేసు యొక్క అధికారాన్ని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు జవాబు చెప్పడం బదులు, ఆయన వారిని తిరిగి ఒక ప్రశ్న అడిగారు.
వారు దానికి సమాధానం ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వారు జవాబు చెబితే, క్రీస్తుకు అపకీర్తి తేవాలనే భక్తిహీనమైన వారి ఆలోచన బయటపడుతుంది గనుక.
దీని వెంటనే, నిజమైన విశ్వాసం అంటే ఏమిటి, బాహ్యంగా కనిపించే నకిలీ విశ్వాసం అంటే ఏమిటి అనే దానిని చెప్పడానికి యేసు ఒక కధ చెబుతారు (మత్తయి 21:28-32).
ఆ కథలో, ఒక తండ్రి తన ఇద్దరు కుమారులను తన ద్రాక్షాతోటలో పని చేయమని అడుగుతారు. అడిగిన వెంటనే నేను చేయను అని మొదటి కుమారుడు చెప్పి, వెంటనే తన మనసు మార్చుకొని చేస్తాడు. రెండవ కుమారుడు చేస్తాను అని చెప్పి, చెయ్యడు.
ఈ మొదటి కుమారుడిని, తమ పాపముల నుండి వెనక్కి తిరిగిన, పన్ను వసూలు చేసే వారితో, వేశ్యలతో, యేసు పోల్చారు. రెండవ కుమారుడిని ఎవరైతే దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పి తమను తామే సేవిస్తున్నారో ఆ పరిసయ్యులతో పోల్చారు.
మొదటి కుమారుడు మనస్సును ఉద్దేశాలను మార్చుకునే నిజమైన పశ్చాతాపానికి గుర్తుగా ఉన్నాడు.
రెండవ కుమారుడు సరైన మాటలు చెప్తాడు గాని చేసే వ్యక్తిగా ఉండని వానికి గుర్తుగా ఉన్నాడు.
మనం గనుక జాగ్రత్తగా లేకపోతే మనలో కూడా ఈ రెండవ కుమారుడు ఉండే అవకాశం ఉంటుంది. కనుక మన విశ్వాసం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఉండేలా జాగ్రత్త పడదాం!
When It Comes to Your Faith, Are You Like the First Son or the Second Son?


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.