నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది

నువ్వు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే, "ఆకాశముకంటె ఎత్తయిన ఆయన కృపను" నువ్వు తెలుసుకోవాలని ప్రార్ధన చేస్తాను!


ఈరోజు ఉదయం 108వ కీర్తన చదువుతూ, నేను దావీదుకున్న విశ్వాసంతో సవాలు చేయబడ్డాను. తాను చాలా కఠినమైన పరిస్థితుల మధ్య కూర్చొని, దేవుడు వారి పోరాటంలో వారితో  లేడు, ఆయన వారిని తృణీకరించారేమో అనే భాధలో ఉన్నాడు (11 వచనం).


అయినప్పటికీ, దావీదు దేవునిపై నమ్మకాన్ని కలిగి స్తుతితో తన కీర్తనను మొదలు పెట్టాడు : "జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము". (3-5 వచనాలు)


దేవుని శక్తిపై నమ్మకంతో తన కీర్తనను ఇలా ముగించాడు "దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. (13 వచనం )


నేనేమి దేశాన్ని నడిపించట్లేదు, దావీదులాగా సైన్యాధిపతినేమి కాదు, కాని తనలాగా కఠినమైన సమస్యలలో కూర్చున్న అనేకమైన సమయాలు నా జీవితంలో చాలానే ఉన్నాయి.


ఇలా జరిగినప్పుడు, నాకు కూడా దావీదులాగా ఉండాలని ఉంది. ఆయనకున్న విశ్వాస్యతను ప్రేమను బట్టి దేవుని స్తుతుంచాలని, ఆయన శక్తిపై నమ్మకాన్ని పెట్టుకోవాలని ఆశపడుతున్నాను.


నా నమ్మకం దేవునిపైనే కాని మనుషులపై పెట్టుకోను (12 వచనం).


దేవుడు నా సమస్యల నుండి నన్ను విడుదల చేయపోయినా, వాటి నుండి నడిపించడానికి నాతోనే ఉంటాడు అని నాకు నేను గుర్తుచేసుకోవాలని ఆశపడుతున్నాను. "ఆకాశము కంటే ఎత్తయిన" ఆయన కృపపై నేను ఆధారపడుదును గాక!


A Love that Is Higher than the Heavens, a Faithfulness that Reaches to the Skies


నువ్వు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటే, "ఆకాశముకంటె ఎత్తయిన ఆయన కృపను" నువ్వు తెలుసుకోవాలని ప్రార్ధన చేస్తాను!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.