ఒక సాధారణ వారంలో, ఎంత తరుచూ నువ్వు చాలా బిజీగా ఉంటావు?
కొన్నిసార్లు పుట్టినరోజులు, సెలవులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, జీవితంలో జరిగే మార్పులు మన ప్రణాళికలను స్వాధీనం చేసుకోవచ్చు. కాని జీవితం సాఫీగా ఉన్నాకూడా, ప్రాధాన్యతలు సరిగా పెట్టుకోలేకపోవడం వలన కూడా మనం బిజీగా ఉంటాం.
బైబిల్ నుండి ఈ క్రింది సత్యాలు మనకు సహాయపడతాయి :
• ఎఫెసీ 2:10 - మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు "ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు" చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. మనం ఒకొక్కరం చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. మనం ఇతర విషయాలతో బిజీగా ఉంటే, దేవుని ప్రణాళికలు పోగొట్టుకుంటాం లేదా అసంపూర్ణమైన హృదయంతో చేస్తాం. దేవునికి నీ యెడల ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని తెలుసుకోవడంలో నీకు ఆనందం లేదా?
• 1 పేతురు 4:10 - దేవుడు మనకు ప్రత్యేకమైన వరాలు ఇచ్చారు. "దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహనిర్వాహకులైయుండాలి". దేవుడు నీకు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఇచ్చారని తెలుసుకోవడంలో నీకు ఆనందం లేదా?
• కొలస్సీ 3:23 - ఈ వచనం క్లుప్తమైన జవాబునిస్తుంది. మనం చేసే పని ఆయనకు అప్పగిస్తే, ఆయనే మన సమయాన్ని, బలాన్ని జ్ఞానంతో ఉపయోగించేలాగా నడిపిస్తారు. దేవుడే నీకు యజమాని అని తెలుసుకోవడంలో నీకు ఆనందం లేదా?
• యోహాను 15 లో మనం "బహుగా ఫలిస్తే" ఆయన మహిమ పరచబడతారు అని యేసు ప్రభువు చెప్పినప్పుడు దానికి అర్ధం అతిగా పనులు పెట్టుకోవడమని కాదు. దేవుడు ప్రత్యేకంగా మన కోసం రూపొందించి ఇచ్చిన నైపుణ్యాలను ఆయన చిత్తాలను నెరవేర్చడం కోసం నమ్మకస్తులముగా వాటిని వాడాలి అని ఆయన ఉద్దేశ్యం.
దానిలో భాగం, ఇంటిలో దేవుని ప్రణాళికను నెరవేర్చడం కోసం తల్లి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టడం కావొచ్చు. కుటుంబంతో, సంఘంతో ఎక్కువ సమయం గడపడం కోసం తండ్రి తన ఉద్యోగాలు మార్చుకోవడం కావొచ్చు. దీనర్ధం బిజీగా ఉండటాన్ని విడిచిపెట్టి, నీ జీవితంలో ప్రణాళికలు వేయడానికి దేవుణ్ణి అనుమతించడమే!
When Busyness Gets the Best of Us


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.